ఆగని సినిమా టికెట్ల వార్.. తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు...

Tammareddy Bharadwaj over AP Movie Ticket Price issue: రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మీ ఆస్తులెంత... ఇప్పుడెంత అని ఎమ్మెల్యే నల్లపరెడ్డిని ఉద్దేశించి నిర్మాత తమ్మారెడ్డి ప్రశ్నించారు. సినిమా కోసం వందల మంది కష్టపడుతారని... కోట్లు పెట్టుబడి పెట్టిన తర్వాత పైసా పైసా ఏరుకుంటున్నామని అన్నారు. కానీ మీ లాగా రూపాయి పెట్టుబడి పెట్టి కోట్ల రూపాయలు దోచుకోవడం లేదన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 12, 2022, 04:34 PM IST
  • దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు
  • ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై భరద్వాజ ప్రెస్ మీట్
  • మీ ఎమ్మెల్యేలు ఎంత తింటున్నారో అంటూ సంచలన కామెంట్స్
 ఆగని సినిమా టికెట్ల వార్.. తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు...

Tammareddy Bharadwaj over AP Movie Ticket Price issue: సినీ ఇండస్ట్రీని ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఖండించారు. పెద్ద సినిమాల హీరోలు వేల రూపాయలకు టికెట్లు అమ్ముకుని ప్రేక్షకులను దోపిడీ చేస్తున్నారంటూ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. సినిమా వాళ్లు కష్టపడి డబ్బు సంపాదిస్తారే కానీ ఎవరినీ దోచుకుని ఆస్తులు కూడగట్టుకోవడం లేదన్నారు. మీ ఎమ్మెల్యేలు ఎంత తింటున్నారో బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఏపీలో టికెట్ల ధరల తగ్గింపుపై హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో తమ్మారెడ్డి మాట్లాడారు.

రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మీ ఆస్తులెంత... ఇప్పుడెంత అని ఎమ్మెల్యే నల్లపరెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు. సినిమా కోసం వందల మంది కష్టపడుతారని... కోట్లు పెట్టుబడి పెట్టిన తర్వాత పైసా పైసా ఏరుకుంటున్నామని అన్నారు. కానీ మీ లాగా రూపాయి పెట్టుబడి పెట్టి కోట్ల రూపాయలు దోచుకోవడం లేదన్నారు. తమను విమర్శించే ముందు  మీ సంగతి మీరు చూసుకోవాలని సూచించారు. చీప్‌గా దొరికామని ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దన్నారు.

సినిమా రంగానికి కులం, మతం ఆపాదించడం సరికాదని అన్నారు. కుల ప్రస్తావన లేకుండా ప్రతిభ ఆధారంగా అవకాశాలిచ్చే ఒకే ఒక్క రంగం సినీ రంగమేనని పేర్కొన్నారు. సినిమా వాళ్లకు దమ్ము, ధైర్యం ఉన్నాయని... తామెవరికీ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. సినిమా టికెట్ ధరలను నియంత్రించే అధికారం ప్రభుత్వానికి ఉందని.. అయితే ప్రొడక్ట్‌కు తామే ధరను నిర్ణయించే హక్కు తమకు కూడా ఉందని అన్నారు. అయితే ఆ హక్కును చట్టబద్దంగా సాధించుకోవాల్సిన అవసరం ఉందని.. ప్రభుత్వంపై, మంత్రులపై నిత్యం విమర్శలు చేయాల్సిన పని లేదని అన్నారు. సినిమా వాళ్లకు లొకేషన్స్ ఫ్రీగా ఇవ్వడం.. సింగిల్ విండో అనుమతులు... ఇలా ఏపీ ప్రభుత్వం సినీ ఇండస్ట్రీకి కొన్ని మంచి పనులు చేసిందన్నారు.

కాగా, రెండు రోజుల క్రితం వైసీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి (Nallapareddy Prasanna Kumar Reddy) సినీ ఇండస్ట్రీని (Tollywood) ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారని ఆయన విమర్శించారు. సినిమా వాళ్లకు చంద్రబాబు సపోర్ట్ ఉందని... అసలు వారికి ఏపీ అనే ఒక రాష్ట్రం ఉందని.. అక్కడ జగన్ సీఎంగా ఉన్నారనే విషయం గుర్తుందా అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే తమ్మారెడ్డి భరద్వాజ నల్లపురెడ్డి వ్యాఖ్యలను ఖండించారు.
 

Also Read: Balakrishna reacts on ticket rates : టికెట్ రేట్ల విషయంలో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News