ఇప్పటం గ్రామంలో ఇప్పుడు మరో వివాదం రేగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్, జనసేన పార్టీలు ఆరోపణలు, ప్రత్యారోపణలు అధికమౌతున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రకటించిన ఆర్ధిక సహాయం అక్కరలేదనే వాదన వస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గుంటూరు జిల్లా మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఇప్పటం గ్రామం ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఇప్పటంలో కొన్ని ఇళ్ల ప్రహారీలను మార్కింగ్ చేసిన ఆర్ అండ్ బి సిబ్బంది తొలగించారు. ఈ వ్యవహారం కాస్తా రచ్చ రచ్చైంది. కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చేశారంటూ..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ గ్రామాన్ని సందర్శించడం మరింత ఉద్రిక్తతకు దారితీసింది. గతంలో జనసేన సభకు ఆ గ్రామస్థులు స్థలాన్ని ఇచ్చినందుకు కక్షతో ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా ఇళ్లను కూల్చేసిందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.


జనసేన, టీడీపీ ఆరోపణలు ఇలా ఉంటే..ప్రభుత్వం మాత్రం ఒక్క ఇంటిని కూడా కూల్చలేదని..కేవలం ప్రహారీ గోడల్ని కూల్చామని స్పష్టం చేసింది. జనసేన, టీడీపీ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని అటు అధికారులు కూడా స్పష్టం చేశారు. 


ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్..రోడ్డు విస్తరణలో కూల్చేసిన ఇళ్లకు లక్ష రూపాయలు ఆర్ధిక సహాయాన్ని ప్రకటించడంతో ఇప్పుడు ఆ గ్రామంలో ఆధిపత్యపోరు నెలకొంది. కొత్తగా ఆ ఊరిలో ఫ్లెక్సీలు వెలిశాయి. ప్రభుత్వం తమ ఇళ్లను కూల్చలేదని..ఎవరి సానుభూతి తమకు అవసరం లేదని, డబ్బులిచ్చి అబద్ధాన్ని నిజం చేయవద్దని విజ్ఞప్తి చేస్తూ ఫ్లెక్సీలు గ్రామంలో హల్‌చల్ చేస్తున్నాయి. 


ఈ ఫ్లెక్సీల్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులే ఏర్పాటు చేశారని జనసేన వర్గాలు ఆరోపిస్తున్నాయి. మొత్తానికి ఇప్పటం గ్రామంలో ఇప్పట్లో సద్దుమణిగే పరిస్థితి కన్పించడం లేదు. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది ఈ గ్రామం. 


Also read: YSRCP: పార్టీ పదవులకు ఇద్దరు ఎమ్మెల్యేలు గుడ్ బై.. వైసీపీలో ఏం జరుగుతోంది..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook