Janasena with NDA: ఏపీలో రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన కూటమిపై ఇప్పటికే స్పష్టత వచ్చేసింది. మరి జనసేన ఎన్డీయేలో భాగస్వామ్య పక్షంగా ఉండటంతో పరిస్థితి ఏంటనేది క్లారిటీ లేదు. తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలు మరింత గందరగోళానికి కారణమౌతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనంటూ మొదట్నించి చెబుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి కోసం ప్రయత్నాలు చేస్తున్నా బీజేపీ అందుకు సిద్ధంగా లేదు. బీజేపీకు టీడీపీని కలుపుకోవడం ఇష్టం లేదు. అలాగని జనసేనను వదులుకోదు. జనసేనకు టీడీపీ అవసరం. ఎందుకంటే అంతిమంగా ఏపీలో జగన్‌ను ఓడించాలంటే టీడీపీతో కలిస్తేనే సాధ్యమనేది పవన్ కళ్యాణ్ లెక్క. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అనంతరం జైళ్లో ములాఖత్ తరువాత టీడీపీతో కలిసే ఎన్నికలకు వెళ్తామని బహిరంగంగా ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఆ సమయంలో కూడా తాను ఎన్డీయేలో ఉన్నానని..బీజేపీ కూడా కలిసొస్తుందనే నమ్మకం ఉందని చెప్పారు పవన్ కళ్యాణ్. 


కానీ తాజాగా పెడనలో చేసిన వ్యాఖ్యలుు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. పార్టీ వర్గాల్లో గందరగోళాన్ని పెంచుతున్నాయి. ఆ వ్యాఖ్యలు చూస్తే పవన్ కళ్యాణ్ ఎన్డీయే నుంచి బయటకు వచ్చేశారనే అర్ధమౌతుంది. ఎన్డీయే కూటమిలో భాగస్వామ్యమై ఉండి, ఇబ్బందులున్నా సరే బయటకు వచ్చి ఎందుకు టీడీపీకు మద్దతు తెలుపుతున్నానంటే అంటూ వివరించారు. టీడీపీ బలహీనంగా ఉన్నప్పుడు, టీడీపీ అవసరం ఏపీకు ఉన్నప్పుడు జనసేన యువరక్తం మీకు అవసరమని పవన్ కళ్యాణ్ తెలిపారు. టీడీపీ అనుభవం-జనసేన పోరాట పటిమ రెండూ కలిస్తే జగన్ ను తొక్కేయవచ్చని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అంటే టీడీపీకు మద్దతిచ్చేందుకు ఎన్డీయేలోంచి బయటకు వచ్చినట్టు స్వయంగా ఆయనే చెప్పుకున్నారు. 


వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి విజయం తధ్యమని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. కూటమికి ప్రజలు సంపూర్ణ సహకారం అవసరమని అంటూనే కేంద్రం ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్టు పవన్ చెప్పారు. ఇదే ఈ వైఖరే జనసేన నేతల్లో, కార్యకర్తల్లో అయోమయాన్ని పెంచుతోంది. ఎన్డీయే నుంచి బయటకు వచ్చి టీడీపీకు మద్దతిచ్చానని చెబుతూనే, కేంద్రం ఆశీస్సులు ఉండాలని కోరుకోవడం వెనుక పరమార్ధమేంటో బోధపడటం లేదు. 


అసలు జనసేన ఎన్డీయేలో ఉందనుకోవాలా లేదనుకోవాలో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. పపవ్ కళ్యాణ్‌కు ఏం కావాలనేది ఇంకా స్పష్టత లేదనే విమర్శలు మాత్రం వెల్లువెత్తుతున్నాయి. 


Also read: CM Jagan Mohan Reddy: రూ.3008 కోట్ల పెట్టుబడి.. 7 వేల మందికి ఉద్యోగావకాశాలు: సీఎం జగన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook