Chiru Support Jagan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సినీ పరిశ్రమకు లింకులు ఎక్కువే. సినీ రంగం నుంచే వచ్చి తెలుగుదేశం పార్టీని స్థాపించారు నందమూరి తారకరామారావు. తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యారు.తర్వాత కాలంలోనూ చాలా మంది సినీ తారలు రాజకీయాల్లోకి వచ్చారు. అయితే టాలీవుడ్ లో ఎక్కువ మంది మద్దతు మాత్రం టీడీపీకే దక్కింది. ఎన్టీఆర్ ప్రభావమే ఇందుకు కారణం. నటశేఖర కృష్ణ కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. రెబెల్ స్టార్ కృష్ణం రాజు బీజేపీ నుంచి ఎంపీగా గెలిచి ఏకంగా కేంద్రమంత్రి అయ్యారు. ఎన్టీఆర్ బాటలోనే మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినా సక్సెస్ కాలేకపోయారు. తర్వాత తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్రమంత్రి అయ్యారు. సినీ తారలు టీడీపీలోనే ఎక్కువగా ఉన్నా వైఎస్సార్ హయాంలో కొంత సీన్ మారింది. మోహన్ బాబు, నాగార్జున కాంగ్రెస్ కు దగ్గరయ్యారు. ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సినీ రంగం నుంచి సపోర్ట్ అంతంతమాత్రమే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో తాజాగా సీఎం జగన్ కు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున మద్దతుదారులుగా కనిపిస్తున్నారు. టికెట్ల వ్యవహారంలో జగన్ సర్కార్ సీరియస్ గా వ్యవహరించింది. టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వలేదు. కొన్ని సినిమాలకు మినహాయింపులు ఇచ్చి మరికొన్ని సినిమాలకు ఇవ్వలేదనే విమర్శలు ఉన్నాయి. పవన్ కల్యాణ్ టార్గెట్ గా జగన్ సర్కార్ నిర్ణయాలు తీసుకుందని.. ఆయన సినిమాల విడుదల సమయంలో ధ‌ర‌లు ‌క్కువ‌గా ఉండేలా జీవోలు ఇచ్చారని ఆయన అభిమానులు గోల చేశారు. తర్వాత చిరంజీవి సారథ్యంలో మ‌హేష్‌బాబు, రాజ‌మౌళి, కొర‌టాల శివ‌, ప్ర‌భాస్ త‌దిత‌రుల‌ు సీఎం జగన్ తో సమావేశమయ్యారు. చిరంజీవి సమావేశం తర్వాత టికెట్ల విషయంలో జగన్ సర్కార్ సినీ పరిశ్రమకు వెసులుబాటు కల్పిస్తూ  కొన్ని నిర్ణయాలు తీసుకుంది.సినిమా బడ్జెట్ ను బట్టి వారం లేదా రెండువారాలు టికెట్ ధ‌ర‌లు పెంచుకునే అవకాశం ఇచ్చింది.


టాలీవుడ్ ప్రముఖలతో జరిగిన సమావేశంలోనే సీఎం జగన్ కొన్ని సూచనలు చేశారు. ఏపీలో సినిమా షూటింగులు, సినిమా ఈవెంట్లు జరపాలని సూచించారు. అలా చేస్తే ప్రభుత్వం నుంచి మరిన్ని రాయితీలు ఇస్తామన్నారు సీఎం జగన్. ఏపీ ప్రభుత్వ సూచన క్రమంగా వర్కవుట్ అయినట్లు కనిపిస్తోంది. ఇంతకాలం హైదరాబాద్ లో జరిగే సినిమా ఆడియో, ప్రీ రిలీజ్ ఈవెంట్లను ఏపీలో నిర్వహిస్తున్నారు. మొదటి నుంచి సీఎం జగన్ కు మద్దతుగా ఉన్న నాగార్జున ఈ విషయంలో వేగంగా స్పందించారు. త‌న బంగార్రాజు సక్సెస్ మీట్ ను రాజమండ్రిలో నిర్వహించారు. ద ఘోస్ట్ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక‌ను కూడా హైద‌రాబాద్‌లో కాకుండా క‌ర్నూలులో జరిపారు.తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా సీఎం జగన్ కు జై కొట్టారు.  త‌న గాడ్ ఫాద‌ర్ చిత్రం ప్రిరీలీజ్ వేడుక‌ను అనంత‌పురంలో నిర్వహిస్తున్నారు. ఈనెల 28వ తేదీన మెగా వేడుక జ‌ర‌గ‌బోతోంది. నాగార్జున నిర్ణయం ఏపీలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఉపయోగకరంగా ఉందనే టాక్ వస్తోంది.


టాలీవుడ్ కు ఎక్కువ ఆదాయం ఏపీ నుంచే వ‌స్తుంది. అయితే రాబడి భారీగా వస్తున్నా ఏపీలో  సినిమా  షూటింగ్‌లు మాత్రం చాలా త‌క్కువ‌గా జ‌రుగుతున్నాయి. ప‌న్ను మిన‌హాయింపులు  ఇస్తామ‌ని ప్ర‌భుత్వం చెబుతున్నా భారీ బడ్జెట్ చిత్రాలు ఏపీ వైపు రావడం లేదు. హైదరాబాద్ ను వదలడం లేదు బడా నిర్మాతలు. చిరంజీవి, నాగార్జున తమ సినిమా ఈవెంట్లను ఏపీలో నిర్వహించడం కొంత ఉపయోగకరమే. త్వరలోనే సినిమా షూటింగులు కూడా ఏపీలో జరుగుతాయనే ఆశాభావం వ్యక్తమవుతోంది. అదే సమయంలో చిరంజీవి, నాగార్జునలు సీఎం జగన్ కు మద్దతుగా నిలిచారనే ప్రచారం సాగుతోంది.


Read also: Rajasthan Crisis: 92 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా?  బీజేపీ చేతికి రాజస్థాన్.. ఇక మిగిలింది ఛత్తీస్ గడ్ ఒక్కటే!


Read also: Mahesh Babu Zee Telugu : మరో జీ తెలుగు అవార్డుల వేడుకకు మహేష్ బాబు.. ఇక రచ్చే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి