Rajasthan Crisis: 92 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా? బీజేపీ చేతికి రాజస్థాన్.. ఇక మిగిలింది ఛత్తీస్ గడ్ ఒక్కటే!

Rajasthan Crisis: రాజస్థాన్ లో కాంగ్రెస్ లో సంక్షోభం మరింత ముదిరింది. ఆ రాష్ట్రాన్ని బీజేపీ చేతికి అప్పగించే వరకు వెళ్లింది. రాజస్థాన్ కాంగ్రెస్ పంచాయతీ ఢిల్లీకి చేరింది. రాజస్థాన్ పరిస్థితులను చక్కబెట్టేందుకు నియమించిన పరిశీలకులు పార్టీ చీఫ్ సోనియా గాంధీని కలిశారు. వాస్తవ పరిస్థితిని వివరించారు.

Written by - Srisailam | Last Updated : Sep 27, 2022, 11:46 AM IST
  • రాజస్థాన్ లో ముదిరిన సంక్షోభం
  • ఏఐసీసీ రేసు నుంచి గెహ్లాట్ అవుట్
  • రాజస్థాన్ లో బీజేపీ పాగా వేస్తుందా?
 Rajasthan Crisis: 92 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా?  బీజేపీ చేతికి రాజస్థాన్.. ఇక మిగిలింది ఛత్తీస్ గడ్ ఒక్కటే!

Rajasthan Crisis: రాజస్థాన్ లో కాంగ్రెస్ లో సంక్షోభం మరింత ముదిరింది. ఆ రాష్ట్రాన్ని బీజేపీ చేతికి అప్పగించే వరకు వెళ్లింది. రాజస్థాన్ కాంగ్రెస్ పంచాయతీ ఢిల్లీకి చేరింది. రాజస్థాన్ పరిస్థితులను చక్కబెట్టేందుకు నియమించిన పరిశీలకులు పార్టీ చీఫ్ సోనియా గాంధీని కలిశారు. వాస్తవ పరిస్థితిని వివరించారు. పరిశీలకుల నివేదిలతో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీరుపై సోనియా గాంధీ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. సోమవారం పార్టీ సీనియర్ నేత కమల్ నాథ్ సంక్షోభ నివారణకు తీవ్రంగా శ్రమించారు. అశోక్ గెహ్లాట్ తో చర్చలు జరిపారు. అయినా సమస్య కొలిక్కి రాలేదు. మరోవైపు అశోక్ గెహ్లాట్ మద్దతు దారులుగా ఉన్న ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధమయ్యారు. సచిన్ పైలెట్ కు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదంటున్న గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలు.. తన రాజీనామా లేఖలను స్పీకర్ కు ఇచ్చారు.

అశోక్ గెహ్లాట్ తీరుపై కాంగ్రెస్ పెద్దలు ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. నమ్మి కీలక బాధ్యతలు అప్పగిస్తే మోసం చేశారనే భావనలో హైకమాండ్ ఉందని సమాచారం. రాజస్థాన్ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి విషయంలో హైకమాండ్ నిర్ణయం మారిందని తెలుస్తోంది. సోమవారం వరకు ఏఐసీసీ చీఫ్ అశోగ్ గెహ్లాట్ పేరు ఖరారైందని ప్రచారం జరిగింది. కాని ఇప్పుడు ఆయన విషయంలో పార్టీ స్టాండ్ మారింది. హైకమాండ్ ను ధిక్కరించే వ్యవహరించారన్న ఆగ్రహంతో ఆయనకు పార్టీ పగ్గాలు ఇవ్వకూడదని నిర్ణయించిందని సమాచారం. తాజాగా కాంగ్రెస్ చీఫ్ రేసులో మల్లిఖార్జున ఖర్గే, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు దిగ్విజయ్ సింగ్,  కమల్ నాథ్ పేర్లు వినిపిస్తున్నాయి.

మరోవైపు కాంగ్రెస్ లో నెలకొన్న సంక్షోభం బీజేపీకి వరంలా మారుతోంది. రాజస్థాన్ లోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పడే సూచనలు కన్పిస్తున్నాయి. అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ మధ్య గ్యాప్ పూడ్చలేని విధంగా పెరగడంతో.. వాళ్లిద్దరిలో ఎవరూ ఒకరు పార్టీ వీడటం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ నుంచి వచ్చే వర్గంతో రాజస్థాన్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుందన తెలుస్తోంది. దేశంలో ప్రస్తుతం రాజస్థాన్ తో పాటు ఛత్తీస్ గడలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. రాజస్థాన్ కూడా కమలం వశమయ్యే సూచనలు కనిపిస్తుండటంతో.. కాంగ్రెస్ కు ఒక్క ఛత్తీస్ గఢ్ మాత్రమే మిగలనుంది. అక్కడ కూడా ముఖ్యమంత్రి బూపేష్ బాగల్ పై ఎమ్మెల్యేల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలుస్తోంది.

Read Also: Seshanna : ఆరున్నర ఏళ్ల తర్వాత దొరికిన నరహంతకుడు.. నయీం ప్రధాన అనుచరుడు శేషన్నఅరెస్ట్

Read Also: Revanth Reddy: రాబోయే ఎన్నికల్లో ఆ స్థానం నుంచే రేవంత్‌ రెడ్డి పోటీ చేయనున్నారా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News