AP EAMCET 2020 Counseling Notification: అమరావతి: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో ఈ ఏడాది ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఎంసెట్‌ – 2020 (AP EAMCET 2020) కౌన్సెలింగ్‌ ప్రక్రియకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కౌన్సెలింగ్ (Counseling Notification) ప్రక్రియ జరగనుంది. ఈ మేరకు అడ్మిషన్ల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్‌ ఎం.ఎం.నాయక్‌ శుక్రవారం బీఈ, బీటెక్, ఫార్మసీ అడ్మిషన్ల నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 23 నుంచి 27 వరకు ఎంసెట్‌ ర్యాంకర్ల ఒరిజినల్‌ సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందన్నారు. ఎంసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు (ఎంపీసీ స్ట్రీమ్‌) ఈ వెబ్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొనెలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇందుకోసం ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600లు ప్రాసెసింగ్‌ ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. అయితే వెబ్‌లో ఆప్షన్లు నమోదు చేసుకోవలసిన షెడ్యూల్‌‌ను తర్వాత ఇస్తామని ఎం.ఎం.నాయక్‌ పేర్కొన్నారు. Also read: IPL 2020: కోల్‌కతాపై ముంబై ఘన విజయం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆన్‌లైన్‌ ఫీజు చెల్లించిన అనంతరం.. అభ్యర్థుల మొబైల్‌ నంబర్‌కు రిజిస్ట్రేషన్‌ నంబర్, లాగిన్‌ ఐడీ వివరాలు మెస్సెజ్ ద్వారా అందుతాయి. ఇలా సమాచారం వస్తే సర్టిఫికెట్ల డేటా పరిశీలన పూర్తయినట్లు అర్థం. ఒకవేళ లేకపోతే.. హెల్ప్‌లైన్‌ కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన చేయించాలనే సందేశం వస్తుంది. వెరిఫికేషన్‌ పూర్తయ్యాక లాగిన్‌ ఐడీ ద్వారా వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ షెడ్యూల్‌ను తర్వాత విడుదల చేయనున్నారు. దీంతోపాటు దివ్యాంగులకు ప్రత్యేక కేంద్రాల్లో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. Also Read : Dinesh Karthik: కేకేఆర్ కెప్టెన్‌పై వేటు.. ఇయాన్ మోర్గాన్‌కు పగ్గాలు‌!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe