ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)లో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ దినేష్ కార్తీక్ (Dinesh Karthik)పై మేనేజ్‌మెంట్ వేటు వేసినట్లు తెలుస్తోంది. దినేష్ కార్తీక్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి ఇంగ్లాండ్‌కు వన్డే ప్రపంచ కప్ అందించిన ఇయాన్ మోర్గాన్‌కు ఆ బాధ్యతలు అప్పగించింది. దీంతో నేటి నుంచి కేకేఆర్ కెప్టెన్‌గా ఇయాన్ మోర్గాన్ (KKR Captain Eoin Morgan) వ్యవహరించనున్నాడు. కాగా, ముంబై ఇండియన్స్ (Mumbai Indians)తో మ్యాచ్ నేపథ్యంలో దినేష్ కార్తీక్ నుంచి మోర్గాన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం గమనార్హం.
- Also Read : RCB vs KXIP match, IPL 2020: రెచ్చిపోయిన క్రిస్ గేల్, రాహుల్.. కోహ్లీ సేనపై పంజాబ్ విజయం
బ్యాటింగ్‌పై ఫోకస్ చేసేందుకు తాను కెప్టెన్సీని వదులుకుంటున్నానని దినేష్ కార్తీక్ చెబుతున్నాడు. ఇయాన్ మోర్గాన్‌తో చర్చించిన తర్వాత తాను ఈ కీలక నిర్ణయం తీసుకున్నాడని కార్తీక్ తెలిపాడు. కేకేఆర్ జట్టుకు 37 మ్యాచ్‌లలో సారథిగా వ్యవహరించిన కార్తీక్ కెప్టెన్సీ మార్క్ మాత్రం చూపించలేకపోయాడు. అయితే కెప్టెన్సీ తనకు భారంగా మారిందని, తాను కేవలం బ్యాటింగ్ బారం మేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేకేఆర్ మేనేజ్‌మెంట్‌కు కార్తీక్ వివరించాడు ఈ నేపథ్యంలో ఇయాన్ మోర్గాన్‌కు కేకేఆర్ కెప్టెన్సీ అప్పగించినట్లు సమాచారం.
ఈ సీజన్‌లో ఇప్పటివరకూ 7 మ్యాచ్‌లాడిన కేకేఆర్ 4 మ్యాచ్‌లలో నెగ్గి, 3 మ్యాచ్‌లలో ఓటమిపాలైంది. ఐపీఎల్ 2020 సరిగ్గా సగం మ్యాచ్‌ల తర్వాత సారథ్య బాధ్యతలపై కేకేఆర్ మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్‌లో ప్రస్తుతం మూడు జట్లకు విదేశీ కెప్టెన్లు ఉన్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు డేవిడ్ వార్నర్, రాజస్థాన్ రాయల్స్‌కు స్టీవ్ స్మిత్ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు.
- Also Read : Fastest Ball In IPL: డెల్ స్టెయిన్ రికార్డు బద్దలు.. ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన బౌలర్ ఇతడే
📰 "DK and Eoin have worked brilliantly together during this tournament and although Eoin takes over as captain, this is effectively a role swap," says CEO and MD @VenkyMysore #IPL2020 #KKR https://t.co/6dwX45FNg5
— KolkataKnightRiders (@KKRiders) October 16, 2020
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe