Janasena TDP Alliance: ఇటీవల బీజేపీ, జనసేన తీరు ఏపీవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 2019 ఎన్నికల తర్వాత రెండు పార్టీలు కలిసి పోగా.. సంయుక్తంగా ముందుకు వెళ్తామని ఆ పార్టీ నేతలు అప్పట్లో ప్రకటించారు. అయితే ఇటీవల రెండు పార్టీల తీరు ఎవరికి వారే యమున తీరే అన్నట్లుగా ఉంది. బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉందా లేదా అన్న చర్చ నడుస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఎన్నికల సమయంలో పొత్తులు ఉంటాయని ఒకసారి.. బీజేపీతో కలిసి పనిచేస్తామని మరోసారి చెబుతున్నారు. దీంతో రెండు పార్టీల మధ్య దూరం పెరిగిందన్న వాదన వినిపిస్తోంది. ఇటీవల జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో జనసేన అంశం ప్రస్తావనకు రాలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు మాత్రం పవన్‌ తమతోనే ఉన్నారని అంటున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు టీడీపీకి జనసేన దగ్గరవుతోంది. రెండు నెలల సమయంలో రెండుసార్లు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. పొత్తులపై పరోక్షంగా సంకేతాలు ఇద్దరు నేతలు ఇచ్చారు. దీంతో రెండు పార్టీల మధ్య అలయన్స్ కుదిరినట్లే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం చేస్తామని ప్రకటించారు. బీజేపీతో జనసేన వెళ్తుందా..? లేక టీడీపీతో పవన్ ప్రయాణం సాగిస్తారా..? అన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. ఎన్నికల నాటికి మూడు పార్టీలు కలిసి పని చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గతంలోనూ ఇలాంటి పరిస్థితులు కనిపించాయని అంటున్నారు.


సోము వీర్రాజు మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ టీడీపీతో పొత్తు పెట్టుకునేది లేదని స్ఫష్టం చేస్తున్నారు. తాము జనసేనతో మాత్రమే పొత్తులో ఉన్నామని చెప్పారు. తెలుగుదేశం-జనసేన పొత్తు గురించి పవన్ కళ్యాణ్‌ను అడగాలని అన్నారు. దీంతో పవన్ కళ్యాణ్ ఎటు తేల్చులేకపోతున్నారని విశ్లేషకులు అంటున్నారు. 


ఇటు పవన్‌పై వైసీపీ మండిపడుతోంది. ఆయనకు ఓ స్పష్టత అంటూ ఏమి లేదని.. పవన్ ఓ ప్యాకేజీ స్టార్‌ అని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఎవరు ఎన్ని కూటములతో వచ్చినా.. తమదే విజయమని స్పష్టం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో వారికి గుణపాఠం తప్పదని స్పష్టం చేస్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా తాను సింగిల్‌గానే వస్తున్నా అంటూ సవాల్ విసిరారు. ఏదిఏమైనా 2024 ఎన్నికల్లో ఏపీలో పొత్తులు ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీని ఓడించడమే తమ లక్ష్యమని ప్రతిపక్షాలు అంటున్నాయి. మరి విపక్షాలన్నీ ఏకం అవుతాయా..? లేక విడివిడిగా పోటీ చేస్తాయా..? అన్నది త్వరలోనే క్లారిటీ రానుంది.


Also Read: CM Jagan Mohan Reddy: సీఎం జగన్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. అసలు కారణం ఇదే..


Also Read: Viral Video: సర్జరీ చేస్తుండగా డాక్టర్ల మధ్య గొడవ.. పేషెంట్‌ని వదిలేసి ఇలా.. లైవ్ ఫుటేజీ లీక్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook