ప్రపంచం మొత్తం కరోనా ( Corona ) తో అల్లాడుతుంటే..ఆ ఇద్దరికి మాత్రం అదే కరోనా ప్రేమానుభూతి ( Corona love )ని మిగిల్చింది. కోవిడ్ సెంటర్ సాక్షిగా చిగురించిన ప్రేమకు వివాహబంధం తోడైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరోనా వైరస్ అందరినీ పట్టిపీడిస్తోంది. మానవాళి బెంబేలెత్తిపోతోంది. ఇదే కరోనా వైరస్ ఆ ఇద్దరి జీవితాల్ని కలిపింది. అదెలాగంటారా ఇదీ స్టోరీ..


హైదరాబాద్ ( Hyderabad ) లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ( Software Engineer ) గా పనిచేస్తున్నప్రకాశం జిల్లా పర్చూరుకు చెందిన యువకుడికి కరోనా సోకింది. గుంటూరులోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరాడు. మరోవైపు ఇంజనీరింగ్ పూర్తి చేసిన చిలకలూరిపేటకు చెందిన యువతి కూడా కరోనా వైరస్ సోకడంతో అదే ఆస్పత్రిలో చేరింది. Also read: AP: రాజధాని రైతుల వ్యవహారం కాదు..ప్రజల హక్కు


పక్కపక్క బెడ్స్ ఇద్దరివీ. తొలి పరిచయమైంది. మాటా మాాటా కలిసింది. మనసులు ( Love in corona ) కలిశాయి. కోవిడ్ నుంచి గట్టెక్కేందుకు ధైర్యం చెప్పుకున్నారు. ఒకరికి మరొకరు సహారాగా నిలిచారు. రెండు వారాల చికిత్స అనంతరం కరోనాను జయించారు. ఇంటికెళ్లి కుటుంబసభ్యులకు చెప్పుకున్నారు. సామాజికవర్గం ఒకటే కావడంతో పెద్దలు అంగీకరించారు. జూలై 25 న పొన్నూరు దేవాలయంలో ప్రేమ వ్యవహారం కాస్తా వివాహబంధంగా మారింది. కేవలం మూడు వారాల్లోనే ప్రేమ పెళ్లిగా మారింది. సోషల్ మీడియాలో ఇప్పుడిది వైరల్ అవుతోంది. Also read: AP: విశాఖలో మెట్రో, సిద్ధమవుతున్న డీపీఆర్