AP: విశాఖలో మెట్రో, సిద్ధమవుతున్న డీపీఆర్

ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాఖపట్నంలో మెట్రో రైలు పరుగులు తీసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. లైట్ మెట్రో ట్రామ్ కారిడార్ ల డీపీఆర్ లు తయారవుతుండగా...ప్రాజెక్టు అంచనా వ్యయంపై అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ దృష్టి పెట్టింది.

Last Updated : Jul 29, 2020, 10:17 AM IST
AP: విశాఖలో మెట్రో, సిద్ధమవుతున్న డీపీఆర్

ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాఖపట్నం ( Ap Executive Capital Visakhapatnam ) లో మెట్రో రైలు పరుగులు తీసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. లైట్ మెట్రో ట్రామ్ కారిడార్ ల డీపీఆర్ లు తయారవుతుండగా...ప్రాజెక్టు అంచనా వ్యయంపై అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ దృష్టి పెట్టింది.

2024 లోగా విశాఖపట్నంలో మెట్రోసేవలు (  Metro Services ) ప్రారంభించాలనే ఆలోచనతో ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. విశాఖలో రెండురకాలైన లైట్ మెట్రో, ట్రామ్ కారిడార్ లకు సంబంధించి డీపీఆర్ ను తయారీ చేసే పనిలో యూఎంటీసీ సంస్థ బిజీగా ఉంది. మరోవైపు ప్రాజెక్టు అంచనా ఎంత అవుతుందనే విషయంపై అమరావతి రైల్ మెట్రో కార్పొరేషన్ ( Amaravathi Rail Metro Corporation ) దృష్టి సారించింది. లైట్ మెట్రోకు కిలోమీటర్ కు 2 వందల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తుండగా..ట్రామ్ కారిడార్ కు 100-120 కోట్లవుతుందని భావిస్తున్నారు.  రెండు ప్రాజెక్టుల డీపీఆర్ ను నవంబర్, డిసెంబర్ నాటికి  ప్రభుత్వానికి అందించేలా యూఎంటీసీ ఒప్పందం కుదుర్చుకుంది. ట్రాఫిక్ ఎప్పుడు ఏ సమయంలో ఉంటుంది...మెట్రో కారిడార్ రూట్ మ్యాప్ లో 2050 నాటికి జరగనున్న మార్పులు, పెరగనున్న ట్రాఫిక్ వంటచి కీలక విషయాల్ని దృష్టిలో పెట్టుకుని డీపీఆర్ సిద్ధమవుతుంది. Also read: Rafale: యుద్ధవిమానాల రాకలో అతని పాత్ర కీలకం..తొలి పైలట్ కూడా

విశాఖలో మెట్రో ( Visakha Metro ) కు సంబంధించి కీలక నిర్ణయాలన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. అందుకే ఇప్పుడు డీపీఆర్ పనులు ఊపందుకున్నాయి. లైట్ మెట్రోకు సంబంధించి గతంలో రూపొందించిన 42.55 కిలోమీటర్ల డీపీఆర్ ను 79.91 కిలోమీటర్లకు అప్ డేట్ చేశారు.  అటు 60.20 కిలోమీటర్ల పొడవుతో ట్రామ్ కారిడార్ కు డీపీఆర్ సిద్ధం చేసే ప్రణాళిక ఖరారైంది.

వాస్తవానికి ఇప్పటికే డీపీఆర్ ( DPR )లు సిద్ధం కావల్సి ఉండగా...కోవిడ్ 19 కారణంగా ఆలస్యమైంది. నవంబర్, డిసెంబర్ నాటికి అందించాలని ప్రభుత్వం అదనపు సమయాన్నిచ్చింది. ఇప్పటికే ట్రామ్ కు సంబంధించి బ్రెజిల్, స్పెయిన్, దుబాయ్, ఫ్రాన్స్ దేశాల్లోని ప్రాజెక్టుల వివరాల్ని సేకరిస్తున్నారు. Also read: AP: రాజధాని రైతుల వ్యవహారం కాదు..ప్రజల హక్కు

Trending News