Jai Jagan Slogans: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పర్యటనలో జై జగన్ నినాదాలు. ఆశ్చర్యపోతున్నారా..నిజమే. జగన్ మేనియానో మరొకటో తెలియదు గానీ ఆ తరువాత నాలుక్కర్చుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సినిమా నటులు రాజకీయాల్లో ప్రవేశించినప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ మిశ్రమంగానే ఉంటుంది. రాజకీయంగా మరొకర్ని అభిమానించినా సినిమా వరకూ ఇంకొకర్ని అభిమానిస్తుంటారు. లేదా అత్యుత్సాహంతో కొందరు అభిమానులు వింతగా ప్రవర్తిస్తుంటారు. ఇది పొరపాటా..లేదా మనసులో ఉన్నది అప్రయత్నంగా బయటికొచ్చిందా తెలియదు గానీ ఆ వింత మాత్రం జరిగింది. అసలేం జరిగిందంటే...


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతులకు అండగా తలపెట్టిన యాత్ర కొనసాగుతోంది. ఇవాళ ఈ యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా హనుమాన్ జంక్షన్ వేలేరు అడ్డరోడ్డుకు చేరుకుంది. అక్కడికి పవన్ కళ్యాణ్ చేరుకోగానే అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏం జరిగిందో తెలియదు గానీ..జై పవన్ అనకుండా జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఓ పక్క అభిమానులు పవన్ కళ్యాణ్‌కు ఘన స్వాగతం పలుకుతూనే జై జగన్ నినాదాలు స్పష్టంగా విన్పించాయి. ఆ తరువాత తేరుకున్నారో ఏంటో కానీ విన్పించలేదు. ఇది అనుకోకుండా అత్యుత్సాహంతో జరిగిందని కొందరంటున్నారు. అత్యుత్సాహంతో జగన్ పేరెందుకు విన్పించాలనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. పవన్‌ను చూసేందుకు జగన్ అభిమానులు అక్కడికి వచ్చారా..లేదా జగన్ మేనియా పవన్ ఫ్యాన్స్‌లో అంతగా పట్టుకుందా. ఎదురుగా తమ అభిమాన నేతను ఆహ్వానిస్తూ..జై జగన్ నినాదాలు విన్పించడంలో మర్మమేంటో అర్ధం కావడం లేదు. రాజకీయంగా జగన్‌ను అభిమానిస్తూ..సినిమా పరంగా పవన్ కు అభిమానులుగా ఉన్నవారి నోటి నుంచి ఈ నినాదాలు వచ్చి ఉండవచ్చనే వాదన కూడా వస్తోంది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ పర్యటనలో జై జగన్ నినాదాలు ఓ హాట్ టాపిక్‌గా నిలిచాయి.


కౌలు రైతుల పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ రైతు కుటుంబాల్ని కలుస్తున్నారు. ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తున్నారు. 41 మంది కౌలు రైతులకు లక్ష రూపాయల చెక్ అందిస్తున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ యాత్ర...ఏలూరు బైపాస్ మీదుగా విజయరాయి, పెదవేగి, ధర్మాజీగూడెం, లింగపాలెం మీదుగా చింతలపూడి చేరుకోనుంది.


Also read: PK Proposal: ఏపీలో వైసీపీ- కాంగ్రెస్ పొత్తు సాధ్యమేనా, పీకే ప్రతిపాదన జగన్‌కు తెలుసా లేదా..?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.