Pawan Kalyan likely to make a statement on future plans in Janasena Avirbhava Sabha: గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామ పరిధిలో ఈరోజు జనసేన ఆవిర్భావ సభ జరగనుంది. పార్టీ స్థాపించి 8 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సభ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జన సైనికులు, వీర మహిళలు, రాష్ట్ర క్షేమాన్ని ఆకాంక్షించే అందరూ ఆహ్వానితులేనని పవన్ తెలిపారు. భావి కార్యచరణఫై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఈ సందర్భంగా విస్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జనసేన 2014 ఎన్నికల్లో పోటీచేయకుండా టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించింది. 2019 ఎన్నికల్లో వామపక్షాలు, బీఎస్పీతో కలిసి పోటీ చేసినప్పటికీ.. ఒక్క స్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఈసారి పకడ్బందీ వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే వ్యూహాలను రూపొందించుకోవాలని పార్టీ నాయకులు ఆలోచనలో ఉన్నారు. వచ్చే ఎన్నికలలో ఏ పార్టీతో కలిసి వెళ్లకుండా..  పోటీ చేయాలని పవన్‌కు పార్టీ నేతలు సూచించినట్లు సమాచారం తెలుస్తోంది. మరి ఈ రోజు జరగనున్న సభలో పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. 


గత మూడేళ్లలో అధికార వైసీపీ సాగించిన అరాచకాలపై గళమెత్తడంతో పాటు భవిష్యత్‌లో సర్కారుపై ఏ తరహాలో యుద్ధం కొనసాగించేదీ పవన్ కళ్యాణ్ వెల్లడించే అవకాశాలున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారో ఈ సభ ద్వారా వివరిస్తామని పవన్ పేర్కొన్నారు. భావితరాలకు ఎలాంటి భరోసా కల్పిస్తే.. మెరుగైన భవిష్యత్ అందించగలం అనే అంశాలపై జనసేన పార్టీ నుంచి ప్రజల్లోకి ఒక బలమైన సందేశం పంపించేలా ఈ ఆవిర్భావ దినోత్సవ సభ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సభకు వచ్చేవారిని ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉందని ఆరోపించారు. పవన్ ప్రసంగం మీద బీజేపీ రాష్ట్ర శాఖ నాయకులు సైతం ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. 


జనసేన పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా స్పెషల్ సాంగ్‌ రిలీజ్ చేశారు. భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ స్టైల్‌లో 'జన జన జన జనసేనా' అంటూ సాగే ఈ పాటకు జనసైనికులను, పవన్ ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు. మరోవైపు ఆవిర్భావ సభ సందర్భంగా ఇప్పటం గ్రామం వద్ద పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పోలీసులు తొలగించడం వివాదానికి దారి తీసింది. విజయవాడతో పాటు గుంటూరు వెళ్లే వారధిపైనా స్వాగత బ్యానర్లు కట్టారు. వాటిని తాడేపల్లి పోలీసులు ఆదివారం తొలగించడంతో వివాదం చోటుచేసుకుంది.


Also Read: Horoscope Today March 14 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి వృధా ఖర్చులు ఉన్నాయి!!


Also Read: Telangana Jobs: తెలంగాణలో మొదలు కానున్న ఉద్యోగాల జాతర, పోలీస్ శాఖ నుంచే ప్రారంభం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook