Horoscope Today March 14 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి వృధా ఖర్చులు ఉన్నాయి!!

March 14 2022, Daily Horoscope. కర్కాటకం, తుల రాశుల వారికి ఈ రోజు అనవసర ఖర్చులు ఉన్నాయి. డబ్బు విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 14, 2022, 07:10 AM IST
  • March 12 2022 రాశి ఫలాలు
  • ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే?
  • ఆ రాశుల వారికి వృధా ఖర్చులు
Horoscope Today March 14 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి వృధా ఖర్చులు ఉన్నాయి!!

Today Horoscope March 14 2022: మేషం ( Aries): కీలక విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్య విషయాల్లో బద్ధకం వద్దు. ఆరోగ్యం జాగ్రత్త. దుర్గ ఆరాధన శుభప్రదం.

వృషభం (Taurus): మిశ్రమ కాలం నడుస్తోంది. అనవసర ఖర్చులు ఉన్నాయి. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందిపడతారు. శని ఆరాధన శుభప్రదం.

మిథునం (Gemini): అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. కొన్ని పనుల్లో అందరి ప్రశంసలు అందుకుంటారు. ఒక సంఘటన ఆత్మ శక్తిని పెంచుతుంది. దుర్గాధ్యానం శుభప్రదం.

కర్కాటకం (Cancer): కీలక నిర్ణయాలు తీసుకునే ముందు బాగా అలోచించాలి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ప్రయాణ సూచన ఉంది. శ్రీ లక్ష్మీగణపతి సందర్శనం శక్తినిస్తుంది.

సింహం (Leo): బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఒక శుభ వార్త కుటుంబంలో ఆనందాన్నిస్తుంది. ప్రయాణాలు చేస్తారు. శివ అష్టోత్తరం చదివితే శుభ ఫలితాలు కలుగుతాయి.

కన్య (Virgo): కాలానుగుణంగా ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. కీలక పనుల్లో జాప్యం జరిగే సూచనలు ఉన్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్త. హనుమాన్ చాలీసా చదివితే మంచి జరుగుతుంది.

తుల (Libra): తలపెట్టిన పనుల్లో ఏమాత్రం జాప్యం వద్దు. వృత్తి, ఉద్యోగ, రంగాలలో మీ పైవారితో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో నిపుణుల సలహాలు మేలు చేస్తాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. చంద్రధ్యాన శ్లోకం చదవడం వలన మంచి ఫలితాలు పొందుతారు.

వృశ్చికం (Scorpio): ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో కలుపుకొని పోవడం వలన సమస్యలను అధిగమించగలుగుతారు. ప్రయాణాలు చేస్తారు. ఈశ్వరుణ్ణి పూజించడం వలన శుభ ఫలితాలను పొందగలుగుతారు.

ధనస్సు (Sagittarius): మంచి ఫలితాలను పొందగలరు. మానసిక ప్రశాంతత ఉంటుంది. పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. విందువినోదాల్లో పాల్గొంటారు. చంద్రశేఖరాష్టకం శుభప్రదం.

మకరం (Capricorn): ఓ ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కొన్ని సంఘటనలు మానసిక ఉత్సాహాన్ని ఇస్తాయి. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజిస్తే ఫలితాలు కలుగుతాయి.

కుంభం  (Aquarius): ఆత్మవిశ్వాసంతో తలపెట్టిన పనులు పూర్తిచేస్తారు. అస్థిర నిర్ణయాలతో ఏ పనులు మొదలు పెట్టకండి. బలమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణ సూచన ఉంది. ఇష్టదేవత స్తోత్ర పారాయణం చేస్తే మంచిది.

మీనం (Pisces): వృత్తి, ఉద్యోగాల్లో సంపూర్ణ అవగాహనతో ముందుకు సాగాలి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. అందరిని కలుపుకొని పోవడం ఉత్తమం. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త ఇష్టదైవారాధన మేలు చేస్తుంది.

Also Read: Gold in India: ధర పెరుగుతున్నా.. తగ్గని బంగారం కొనుగోళ్లు, కారణాలేంటి

Also Read: Earthquake: మలేషియా, ఫిలిప్పీన్స్ దేశాల్లో తెల్లవారుజామున భారీ భూకంపం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News