అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా ఏపీ సర్కార్‌ని నిలదీశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ వద్ద యురేనియం డ్రిల్లింగ్ పనులు జరుగుతున్నట్టుగా ది హిందూ వార్తాపత్రికలో ప్రచురించిన కథనం ఫోటోను ట్విటర్‌లో పోస్ట్ చేసిన పవన్.. దీనికి జగన్ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి తెలియకుండానే ఇదెలా సాధ్యమని ప్రశ్నించిన పవన్... జిల్లా కలెక్టర్‌కి సైతం ఆ విషయం తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉందని విస్మయం వ్యక్తంచేశారు.



అలాగే యురేనియం తవ్వకాల నుంచి నల్లమల అడవులను కాపాడాలంటూ విమలక్క పాడిన ఓ పాటను పోస్ట్ చేసిన పవన్.. ఆ పాట స్పూర్తిదాయకంగా ఉందన్నారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా జరిపే పోరాటాలకు ప్రజలకు జనసేన అండగా ఉంటుందని పేర్కొన్నారు.