Mandous Cyclone Affected Areas In Ap: మాండూస్ తుఫాన్ బాధితులను ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ డిమాండ్ చేశారు. ప్రత్యర్థి రాజకీయపక్షాల నాయకులను తిట్టడానికి వరుసలో నాయకులను పంపే తాడేపల్లి పెద్దలు.. ఇటువంటి విపత్కర పరిస్థితులలో రైతులకు అండగా ఉండమని తమ నాయకులకు ఎందుకు చెప్పరు..? అని ప్రశ్నించారు. ఒక వైపు గిట్టుబాటు ధరలు, ప్రభుత్వ సహాయ సహకారాలు అందక అల్లాడిపోతున్న ఆంధ్రప్రదేశ్‌ రైతులను మాండూస్‌ తుఫాన్ మరోసారి దెబ్బ తీసిందన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోతకు వచ్చిన చేలు, కల్లంలో ఉంచిన ధాన్యం కళ్లెదుట నీటిలో నానిపోతుంటే దైన్యంగా చూస్తున్న రైతులను చూస్తుంటే గుండె భారంగా మారుతోందన్నారు పవన్ కళ్యాణ్. ఉమ్మడి జిల్లాలైన చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి ప్రాంతాలలో లక్షలాది ఎకరాలలో వరి పంట నీటిపాలైంది. పత్తి లాంటి వాణిజ్య పంట, బొప్పాయి, అరటి వంటి పండ్ల తోటలు తుపాను ధాటికి నేల రాలాయని చెప్పారు. ఇంత జరుగుతున్నా మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు ఎందుకు ధైర్యం చెప్పరు..? అని నిలదీశారు. 


ధాన్యం అమ్ముకోవడానికి అగచాట్లు


'గత వ్యవసాయ సీజన్‌కు సంబంధించి ధాన్యం బకాయిలు రూ.320 కోట్లుపైగా ఉన్నాయి. రైతులు ఆర్థికంగా ఇబ్బందులు, పాలవుతుంటే ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందీ, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ఎందుకు పట్టించుకోవడం లేదో ప్రతి ఒక్కరూ నిలదీయాలి. ఈ సీజన్లో ధాన్యం అమ్ముకోవడానికి రైతులు అగచాట్లు పడుతున్నారు. తేమ శాతం పేరుతో ఇబ్బందులు పెడుతున్నారు. 


లక్షన్నర ఎకరాలలో వరి పూర్తిగా తుడుచుపెట్టుకుపోయింది. ఇంకొన్ని లక్షల ఎకరాలలో చేలు నీటిలో నానుతున్నాయి. అందువల్ల తుపాను దెబ్బతో నష్టపోయిన రైతుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికపరమైన అండను ఇవ్వాలి. సహేతుకమైన నష్టపరిహారాన్ని ప్రతి ఎకరాకు చెల్లించాలి. కల్లంలోని తడిసిన ధాన్యాన్ని ఇప్పటికైనా తక్షణం కొనుగోలు చేయాలి. కూరగాయలు, పండ్లతోటల రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాం. అదేవిధంగా జనసేన నాయకులు, జన సైనికులు, వీరమహిళలకు విజ్ఞప్తి చేస్తున్నా.. రైతులకు చేతనైనంతగా సహాయపడండి. నష్టంతో అసహాయంగా ఎదురుచూస్తున్న రైతుల పకాన నిలబడండి. వారి దుస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్లండి.. రైతాంగానికి మానసిక ధైర్యం కల్పించండి. సాయం అందకపోతే ప్రజాస్వామ్య రీతిలో ప్రశ్నించండి..' అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు జనసేన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి పోస్ట్ పెట్టారు.


Also Read: SIPB: ఏపీలో రూ.23,985 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్.. భారీగా ఉద్యోగ అవకాశాలు  


Also Read: Upasana Konidela Pregnancy : తండ్రి కాబోతోన్న రామ్ చరణ్‌.. గుడ్ న్యూస్ చెప్పిన మెగాస్టార్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook