Dry Fruits For Diabetes: షుగర్‌ కంట్రోల్‌ చేసే శక్తివంతమైన డ్రై ఫ్రూట్స్‌ ఇవే!

Dry Fruits That Help People With Diabetes: డయాబెటిస్‌ సమస్యతో బాధపడేవారు  ఆహారంలో పలు మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా డ్రైఫూట్స్‌ తీసుకోవడం చాలా మంచిది. అయితే ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల షుగర్‌ కంట్రోల్‌ ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : May 16, 2024, 10:57 AM IST
Dry Fruits For Diabetes: షుగర్‌ కంట్రోల్‌ చేసే శక్తివంతమైన  డ్రై ఫ్రూట్స్‌  ఇవే!

Dry Fruits That Help People With Diabetes: డయాబెటిస్‌ అనేది ప్రస్తుత కాలంలో ప్రతిఒకరిని వేధించే సమస్యగా మారింది. ఈ సమస్య బారిన చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా దీని బారిన పడుతున్నారు. ఈ డయాబెటిస్‌తో బాధపడేవారు వారి జీవనశైలిలో, ఆహారం కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల రక్తంలో షుగర్‌ లెవల్స్‌ అదుపులో ఉంటాయి.  షుగర్‌ తక్కువగా , గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల డయాబెటిస్‌ తగ్గుతుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు.  వీటితోనే కాకుండా ప్రతిరోజూ వ్యాయామం, డ్రై ఫ్రూట్‌ తీసుకోవడం వల్ల షుగర్‌ లెవల్స్ అదుపులో ఉంచుకోవ్చని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. 

అయితే సాధారణంగా  డ్రై ఫూట్స్‌లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇవి షుగర్‌ స్పైక్‌లను నియంత్రించడానికి సహాయపడుతుంది.  ఎలాంటి డ్రైఫూట్స్‌ తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. 

డ్రై ఫూట్స్‌లో  విటమిన్,  మినరల్స్‌, ఫైబర్‌ , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటుంది. డయాబెటిస్‌తో బాధపడేవారు రక్తంలో గ్లూకోజ్‌ లెవల్స్‌పై శ్రద్ధ వహించాలి. షుగర్ వ్యాధిగ్రస్తులు ఫైబర్ కంటెంట్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఇది గ్లూకోజ్‌ లెవల్స్‌పై తక్కువ ప్రభావాన్ని చూపుతుంది. 

డ్రై ఫ్రూట్స్‌లో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నప్పటికీ, మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలపై శ్రద్ధ వహించాలి. ఫైబర్ అధికంగా ఉండే డ్రై ఫ్రూట్‌లను ఎంచుకోండి. ఫైబర్ నెమ్మదిగా జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలపై తక్కువ ప్రభావాన్ని చూపుతుంది. అలాంటి డ్రై ఫ్రూట్స్ ఏంటో, వాటి పోషక విలువలు ఏమిటో చూద్దాం.

డయాబెటిస్‌ ఉన్నవారు తప్పకుండా తీసుకోవాల్సి న డ్రైఫ్రూట్స్ ఇవే: 

బాదం:

డయాబెటిస్‌ ఉన్నవారు ప్రతిరోజు బాదం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. షుగర్ కంట్రోల్‌ చేయడంలో బాదం  మొదటి స్థానంలో ఉంటుంది.  ఇది రక్తంలో ఉండే షుగర్‌ లెవల్స్‌ను తగ్గించడంతో పాటు గుండె జబ్బులు ప్రమాదాన్ని నివారిస్తుంది. బాదం పప్పులో  ఫైబర్‌, విటమిన్‌ ఇ, బి-12, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి. 

పిస్తా పప్పు: 

పిస్తా పప్పులో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కుగా ఉంటుంది. ఇది డయాబెటిస్‌ ఉన్నవారికి టైప్-2 డయాబెటిస్‌  వారికి ఎంతో మేలు చేస్తుంది. పిస్తాలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఇది మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. కాబట్టి డయాబెటిస్‌ ఉన్నవారు వీటిని తీసుకోవడం చాలా మంచిది. 

అక్రోట్ల:

అక్రోట్లలో ఒమేగా-3 పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో షుగర్‌ లెవల్స్‌ నియంత్రించడంలో ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి  డయాబెటిస్‌ ఉన్న వ్యాధిగ్రస్తులు తీసుకోవడం చాలా మంచిది. 

జీడిపప్పు: 

డయాబెటిస్‌తో బాధపడేవారు జీడిపప్పు తీసుకోవడం చాలా మంచిది. జీడిపప్పులో కొవ్వు అధికంగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ను కంట్రోల్‌ చేయడంలో ఎంతో ఉపయోగపడుతుంది.  మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.  గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. 

వేరుశెనగలు: 

వేరుశెనగలు తీసుకోవడం వల్ల ప్రోటీన్‌, కొవ్వులు, ఫైబర్‌ అధికంగా దొరుకుతాయి.  ఇందులో గ్లైసెమిక్‌ సూచికను కలిగి ఉంటుంది. ఇవి స్నెక్స్‌గా తీసుకోవడం వల్ల  ఎన్నో లాభాలు పొందవచ్చు. 

గమనిక:

గింజలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఎంతో మేలు చేస్తుంది. అయితే వీటిని తీసుకోనే ముందు మీరు వైద్యుడిని సంప్రదించడం చాలా మంచిది. 
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News