Pawan Kalyan: విశాఖలో నిలిచిన జనసేనాని పర్యటన, పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు పవన్ కళ్యాణ్ హెచ్చరిక
Pawan Kalyan: విశాఖలో పవన్ కళ్యాణ్ పర్యటన వివాదాస్పదంగా మారింది. పవన్ కళ్యాణా్ పర్యటనను పోలీసులు అడ్డుకోవడంతో వివాదం మరింతగా పెరిగింది. పోలీసుల తీరును జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా మండిపడ్డారు. ధర్నాకు దిగుతానంటూ హెచ్చరించారు.
విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనను పోలీసులు అడ్డుకోవడంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ముఖ్యంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు మద్యలో తనను నిలువరించడంతో పోలీస్ స్టేషన్ ముందే ధర్నాకు దిగుతానంటూ డీజీపీకు వార్నింగ్ ఇచ్చారు.
విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన వివాదాస్పదమైంది. విశాఖ గర్జన అనంతరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న మంత్రులు రోజా, జోగి రమేష్ కార్లపై జనసేన కార్యకర్తలు దాడి చేయడంతో ఎయిర్‌పోర్ట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అయితే దాడులు జరగలేదని..అంతా వైసీపీ ఆడుతున్న నాటకమని జనసేన స్పష్టం చేసింది.
అనంతరం పవన్ కళ్యాణ్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించి నిలువరించడంపై జనసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీస్ స్టేషన్ ముందే ధర్నాకు దిగుతానని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. మరోవైపు ఈ వ్యవహారంపై జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. ఎవరి ఒత్తిడితో పవన్ కళ్యాణ్ పర్యటనను అడ్డుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖ గర్జన విఫలం చెందిందనే అక్కసుతోనే ప్రభుత్వం ర్యాలీ ఆపిందని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.
పవన్ కళ్యాణ్ ప్రజలకు కన్పించేందుకు కారుపై నిలుచుంటే..బలవంతంగా కూర్చోమని ఆదేశాలివ్వడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. పోలీసులు చర్యల కారణంగా తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వద్ద పవన్ కళ్యాణ్ పర్యటన నిలిచిపోయిందని నాదెండ్ల స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ పర్యటన నిమిత్తం నిబంధనల ప్రకారం వారం క్రితమే భద్రత అడిగామన్నారు. ప్రజల్ని తామే నియంత్రించాలని పోలీసులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. శాంతి భద్రతలు ఎవరి సమస్య అని..ఎందుకు భద్రత ఇవ్వలేకపోయారని నాదెండ్ల పోలీసుల వైఖరిని ఎండగట్టారు.
విమానాశ్రయంలో ఒక రోప్ పార్టీని మాత్రమే ఇచ్చారని..ఆ తరువాత ఎన్ఏడీ జంక్షన్ దాటేవరకూ ఒక్క పోలీసు అధికారి కూడా లేరని తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ, డైవర్షన్ చేయలేదన్నారు. పోలీసుల నియంత్రణ లేకపోవడం వల్లనే ఇబ్బందులు తలెత్తాయన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు మంచివి కావని నాదెండ్ల మనోహర్ హితవు పలికారు.
Also read: Janasena Clarity: విశాఖలో మంత్రుల కార్లపై దాడంటూ ప్రచారం.. జనసేన వెర్షన్ ఇదీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook