Janasena About YS Jagan: సీఎం గాల్లో ప్రయాణిస్తుంటే... హైవే మీద వాహనాలు ఆపుతారా ?
Janasena About AP CM YS Jagan: సీఎం వైయస్ జగన్ రోడ్డు మీదకు వస్తే చాలు బయటికి కనిపించకుండా పరదాలు కట్టించుకోవడం, దుకాణాలు మూసివేయడం లాంటి ప్రజా వ్యతిరేక చర్యలు చూస్తోంటే ముఖ్యమంత్రి రాన్రాను అభద్రతాభావం మరింత ఎక్కువైపోతోందని అనిపిస్తోందని నాదెండ్ల అనుమానం వ్యక్తంచేశారు.
Janasena About AP CM YS Jagan: తాడేపల్లిలో ప్యాలెస్ లాంటి సీఎం క్యాంప్ ఆఫీసు నుంచి అడుగు బయటకు పెడితే హెలికాప్టర్ ఎక్కే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి కింద హైవే పై వెళ్లే వాహనాలు ఎలా అడ్డం అవుతాయో అర్థం కావడం లేదు అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విస్మయం వ్యక్తంచేశారు. బుధవారం విజయనగరం జిల్లాలో భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేయడం కోసం ఏపీ సీఎం వైయస్ జగన్ హెలీక్యాప్టర్ లో వెళ్లిన సంగతి తెలిసిందే.
ఇదిలావుంటే, సీఎం వైయస్ జగన్ రాక సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పలాస వద్ద, మరోవైపు అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద నేషనల్ హైవేపై వాహనాలను నిలిపేశారని.. ముఖ్యమంత్రి వాయు మార్గంలో వెళ్తుండగా.. కింద జాతీయ రహదారులపై ట్రాఫిక్ నిలిపివేయడం విచిత్రంగా ఉంది అని నాదెండ్ల మనోహర్ అన్నారు. అది కూడా ఏకంగా గంటల తరబడి వాహనాలు ఆపివేయడం వల్ల వాహనదారులు, వాహనాల్లో ప్రయాణిస్తున్న వారు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు అని అక్కడి పోలీసుల తీరుపై మండిపడ్డారు.
సీఎం వైయస్ జగన్ రోడ్డు మీదకు వస్తే చాలు బయటికి కనిపించకుండా పరదాలు కట్టించుకోవడం, దుకాణాలు మూసివేయడం లాంటి ప్రజా వ్యతిరేక చర్యలు చూస్తోంటే ముఖ్యమంత్రి రాన్రాను అభద్రతాభావం మరింత ఎక్కువైపోతోందని అనిపిస్తోందని నాదెండ్ల అనుమానం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాయుమార్గంలో వెళ్తుంటే.. కింద వాహనాలు ఆపేయడం పోలీసుల అత్యుత్సాహమే అవుతుంది అని మండిపడ్డారు.
ఇది కూడా చదవండి : Cyclone Mocha News: ఏపీకి మరో గండం.. ముంచుకొస్తున్న 'మోచా' తుపాను ముప్పు
పోలీసుల పరాకాష్టకు ఉదాహరణగా భోగాపురానికి అటూయిటూ 150 కి.మీ. దూరాన హైవేపై వాహనాలు ఆపివేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం, పోలీసుల వైఖరి వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పాలవుతున్నారని ఆరోపించిన మనోహర్.. సీఎం వైఎస జగన్ భోగాపురం పర్యటన నేపథ్యంలో నెల్లిమర్ల నియోజకవర్గ పరిధిలోని జనసేన నాయకులు తుమ్మి లక్ష్మీరాజ్, పతివాడ కృష్ణవేణి, పతివాడ అచ్చన్నాయుడు, కారి అప్పలరాజు వంటి జనసేన పార్టీ నేతలను అరెస్ట్ చేయడం, గృహ నిర్బంధాలు చేయడం అప్రజాస్వామికం అవుతుందని... ఇలాంటి చర్యలను జనసేన పార్టీ తరపున ఖండిస్తున్నాం అని ప్రకటించారు.
ఇది కూడా చదవండి : Minister Roja to Chandrababu: చంద్రబాబుపై మంత్రి రోజా సంచలన ఆరోపణలు
ఇది కూడా చదవండి : Wife Killed Husband: ప్రియుడితో అక్రమ సంబంధం.. తెలివిగా భర్త మర్డర్.. కూతురికి సహకరించిన తండ్రి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK