JC Brothers: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక వెలుగు వెలిగిన మాజీ మంత్రి జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినా తన సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లు తాను అవస్థలు పడ్డానని వాపోయారు. ఇప్పటికీ తనపై నమోదైన కేసులు పరిష్కారం కాలేదని.. తన వ్యాపారం మొత్తం పోయిందని వివరించారు. అయినా కూడా తాను వెనక్కి తగ్గనని ప్రకటించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: YS Jagan: 'ఎవరూ అధైర్యపడొద్దు.. మంచి రోజులు వస్తాయి' మాజీ సీఎం జగన్‌ భరోసా


తనపై.. తన బస్సుల వ్యాపారంపై నమోదైన కేసుల అంశంపై శుక్రవారం జేసీ ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా తాను ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. 'నేను అయిదేళ్లు చాలా అవస్థలు పడ్డా. మాకు వైఎస్ కుటుంబానికి ఎప్పటి నుంచో సాన్నిహిత్యం ఉండేది. కానీ ఇప్పుడు పోయింది. వైఎస్‌ రాజారెడ్డి దగ్గర నుంచి మాకు ఆ కుటుంబంతో సాన్నిహిత్యం లేదు. జాతీయ స్థాయిలో బస్సులు నడిపిన మేము బస్సులను పోగుట్టుకున్నాం. మేము ఈ అయిదేళ్ల కోసం అన్ని అమ్ముకున్నాం' అని జేసీ ప్రభాకర్‌ రెడ్డి తెలిపారు.

Also Read: YS Sharmila: చేతకాని చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఎన్డీయే నుంచి బయటకు రావాలి.. వైఎస్‌ షర్మిల సంచలన డిమాండ్‌


' మేము ఏం తప్పు చేయలేదు. డబ్బుల కోసం కాదు. మా ఇంట్లో లేని కారు లేదు. మేము నడపని కారు లేదు. మేము కావాలంటే క్లీనర్‌గా పని చేస్తా లేదా వాచ్‌మాన్‌గా అయినా పని చేసుకుంటా' అని జేసీ ప్రభాకర్‌ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను చూపించారు. 'నా లారీలు ఇప్పటికీ అక్కడే ఉన్నాయి. ఈ ఆలోచనలతో మా అన్న జేసీ దివాకర్ రెడ్డికి ఆరోగ్యం బాగాలేదు. నేను పిచ్చి *** కొడుకుని కాదు. మేము రాజకీయాల్లో ఉన్నది ప్రజల కోసం' అని స్పష్టం చేశారు.


'నా కొడుకులు ఇద్దరు అలిగి వెళ్లారు. ఇంట్లో లేరు. లారీలు పగలకొట్టారు అయినా నేను పట్టించుకోను. నేను ఎవరికీ భయపడను. ఇంట్లో ఉండే పెరుగన్నం తిని బతుకుతా' అని జేసీ ప్రభాకర్‌ రెడ్డి ప్రకటించారు. తామూ రాజ వంశీకులమని చెప్పారు. 1952 నుంచి  2024 వరకు  రాజకీయంగా అందరికీ సహాయం చేశామని వెల్లడించారు. కేతిరెడ్డి మా ఇంట్లోకి వచ్చినప్పుడు తాను పెళ్లిలో ఉన్నట్లు తెలిపారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook