JNTU has released the TS EAMCET 2020 dates: హైదరాబాద్: కరోనావైరస్ కారణంగా వాయిదా పడిన కామన్ ఎంట్రన్స్ పరీక్షలకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. ప్రభుత్వం ప్రణాళికను రూపొందించిన విధంగానే ముందుకు సాగుతోంది. రెండు రోజుల క్రితం టీఎస్ ఈసెట్ (TS ESET) ను నిర్వహించింది. అయితే.. తాజాగా టీఎస్ ఎంసెట్ నిర్వహణ కోసం పరీక్షల తేదీలను సైతం జెఎన్టీయూ (JNTU) విడుదల చేసింది. ఈ నెల 9, 10, 11, 14 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్‌లో  ఎంసెట్ (TS EAMCET 2020) పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. రేపటి నుంచి పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. Also read: TSCETS 2020: తెలంగాణలో ప్రవేశ పరీక్షల తేదీలు ఇవే..


అయితే ఈ ఎంసెట్ పరీక్షను ఇరు తెలుగు రాష్ట్రాల్లోని 102 సెంటర్లలో నిర్వహించనున్నారు. తెలంగాణలో 79, ఏపీలో 23 పరీక్షా కేంద్రాలను టీఎస్ఎంసెట్ కోసం కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ పరీక్ష కోసం మొత్తం 1,43,165 అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో సోషల్ డిస్టెన్సింగ్ పాటించేలా.. కోవిడ్ నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. Also read: AP High Court: మద్యం ప్రియులకు ఉపశమనం.. మూడు బాటిళ్లు తెచ్చుకోవచ్చు