AP Jobs Calendar: ఏపీ జాబ్స్ క్యాలెండర్ విడుదల చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్
Jobs Calendar In AP: వైఎస్సార్‌సీపీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పేర్కొనట్లుగా పలు శాఖల్లో ఇదివరకే దాదాపుగా ఖాళీలను ఏపీ ప్రభుత్వం భర్తీ చేసింది. తాజాగా 2021-22 ఏపీ జాబ్ క్యాలెండర్‌ను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు.
AP Jobs Calendar: ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2021-22 జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నాడు ఉద్యోగల భర్తీకి సంబంధించిన వివరాలు అందించారు. అధికారంలోకి వచ్చిన గత రెండేళ్ల పరిపాలన కాలంలో 6,03,756 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినట్లు తెలిపారు. ఇందులో ఔట్ సోర్సింగ్ 3,99,791 పోస్టులు, 1,84,264 పర్మినెంట్ పోస్టులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు 19,701 మేర భర్తీ చేసినట్లు జాబ్ క్యాలెండర్ ద్వారా వివరించారు.
వైఎస్సార్‌సీపీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పేర్కొనట్లుగా పలు శాఖల్లో ఇదివరకే దాదాపుగా ఖాళీలను ఏపీ ప్రభుత్వం భర్తీ చేసింది. తాజాగా 2021-22 ఏపీ జాబ్ క్యాలెండర్‌ను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan) విడుదల చేశారు. మొత్తం 10,143 భర్తీకి ఏపీ సర్కార్ శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఆయా శాఖలలో ఖాళీలలో పాటు వాటి భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ ఏ నెలలో విడుదల చేయనున్నారో సైతం తెలపడం విశేషం. మొత్తం పోస్టులలో అత్యధికంగా వైద్యశాఖ పారా మెడికల్, ఫార్మసిస్ట్‌లు, ల్యాబ్ టెక్నీషియన్లు 5,251 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికి నవంబర్ 2021లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు క్యాలెండర్‌లో పేర్కొన్నారు.
Also Read: AP Exams: ఏపీలో పదవ తరగతి , ఇంటర్మీడియట్ పరీక్షలకు రంగం సిద్ధం
బ్యాక్‌లాగ్ వేకెన్సీలు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల కేటగిరీలో 1,238 పోస్టులు,
ఏపీపీఎస్సీ (APPSC) గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 పోస్టులు 36,
పోలీసు శాఖలో 450 పోస్టులు
వైద్యశాఖ డాక్టర్లు మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్లు 451 పోస్టులు
వైద్యశాఖ పారా మెడికల్, ఫార్మసిస్ట్‌లు, ల్యాబ్ టెక్నీషియన్లు 5,251
వైద్యశాఖ నర్సులు 441 పోస్టులు
విద్యాశాఖ లెక్చరర్లు (డిగ్రీ కాలేజీలు) 240 పోస్టులు
విద్యాశాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ( యూనివర్సిటీలు) 2000 పోస్టులు
ఇతర శాఖలలో పోస్టులు 36 ఖాళీగా ఉన్నాయి.
Also Read: AP SSC exams 2021, AP inter Exams 2021: ఏపీలో పదో తరగతి పరీక్షలు, ఇంటర్ పరీక్షలు ఎప్పుడు ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook