ఊహించిందే జరిగింది. తెలుగు రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తులు మారారు. నిన్న తెలంగాణ హైకోర్టు..ఇవాళ ఏపీ హైకోర్టుకు కొత్త ఛీఫ్ జస్టిస్‌లు నియమితులయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


తెలంగాణా హైకోర్టు ఛీఫ్ జస్టిస్ ( Telangana high court chief justice ) ‌గా జస్టిస్ హిమ కోహ్లి ( justice hima kohli ) నియమితులైన విషయం తెలిసిందే. ఇవాళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ( Ap High court ) ఛీఫ్ జస్టిస్‌గా జస్టిస్ అరుప్ గోస్వామి ( justice Arup kumar goswami ) నియమితులయ్యారు. సిక్కిం హైకోర్టు ఛీఫ్ జస్టిస్‌గా ఉన్న గోస్వామిని..ఏపీకు బదిలీ చేయగా..ఏపీ ఛీఫ్ జస్టిస్‌గా ఉన్న జస్టిస్ జేకే మహేశ్వరిని సిక్కింకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. 


సిక్కిం హైకోర్టు ఛీఫ్ జస్టిస్‌గా ఉన్న జస్టిస్ అరుప్ గోస్వామి ( Justice Arup Goswami ) 1961 మార్చ్ 11న అస్సోంలోని జోర్హాట్‌లో జన్మించారు. 1985లో గౌహతి ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. 1985 ఆగస్టులో న్యాయవాదిగా నమోదై..సివిల్, క్రిమినల్, రాజ్యాంగం, ఉద్యోగ సేవలకు సంబంధించిన విభిన్న కేసుల్లో వాదించారు. 2011లో గౌహతి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, తరువాత శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.


2019 అక్టోబర్‌లో పదోన్నతిపై సిక్కిం హైకోర్టు ( Sikkim high court )ప్రధాన న్యాయమూర్తిగా బాథ్యతలు చేపట్టారు జస్టిస్ అరుప్ గోస్వామి. 2011 నుంచి 2013 వరకూ నాగాలాండ్ రాష్ట్ర న్యాయసేవా సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా పని చేశారు. 


దేశవ్యాప్తంగా 9 హైకోర్టులకు కొత్త సీజేలను నియమించింది సుప్రీంకోర్టు కొలీజియం ( Supreme court collegium ). నాలుగు రాష్ట్రాల సీజేలను బదిలీ చేయగా..మరో ఐదుగురికి పదోన్నతి కల్పించింది. మరో ఐదుగురు న్యాయమూర్తుల బదిలీ కూడా జరిగింది. ఈ నెల 14 న కొలీజియం సమావేశం జరిగింది. Also read: AP: తెలుగు రాష్ట్రాలకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు..ఎవరంటే..