AP: తెలుగు రాష్ట్రాలకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు..ఎవరంటే..

తెలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు మారుతున్నారు. తెలంగాణ హైకోర్టు నూతన ప్రదాన న్యాయమూర్తి పేరు ఇప్పటికే ఖరారు కాగా..ఏపీ హైకోర్టు  ప్రధాన న్యాయమూర్తి పేరింకా ఖరారు కావల్సి ఉంది. 

Last Updated : Dec 15, 2020, 07:51 PM IST
  • ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు ?
  • తెలంగాణ హైకోర్టు ఛీఫ్ జస్టిస్ గా జస్టిస్ హిమ కోహ్లి పేరు దాదాపు ఖరారు
  • ఏపీ హైకోర్టు ఛీఫ్ జస్టిస్ గా సిక్కిం సీజే జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి పేరు ఖరారయ్యే
AP: తెలుగు రాష్ట్రాలకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు..ఎవరంటే..

తెలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు మారుతున్నారు. తెలంగాణ హైకోర్టు నూతన ప్రదాన న్యాయమూర్తి పేరు ఇప్పటికే ఖరారు కాగా..ఏపీ హైకోర్టు  ప్రధాన న్యాయమూర్తి పేరింకా ఖరారు కావల్సి ఉంది. 

ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ), తెలంగాణ ( Telangana ) రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు వస్తున్నారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమ కోహ్లి ( Justice Hima kohli )పేరు ఖరారైందని తెలుస్తోంది. మరోవైపు ఏపీ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి ( Justice Arup kumar goswamy )పేరు విన్పిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న హిమ కోహ్లిని తెలంగాణ హైకోర్టు ( Telangan high court ) ఛీఫ్ జస్టిస్‌గా ఎంపిక చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఛీఫ్ జస్టిస్‌గా ఉన్న జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్‌ను మరో ప్రాంతానికి బదిలీ చేశారని తెలుస్తోంది.  సిక్కిం రాష్ట్ర హైకోర్టు ఛీఫ్ జస్టిస్‌గా ఉన్న అరుప్ కుమార్ గోస్వామిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ( Ap high court ) ఛీఫ్ జస్టిస్‌గా నియమించనున్నారని తెలుస్తోంది. 

ఏపీ ఛీఫ్ జస్టిస్‌గా ఉన్న జేకే మహేశ్వరిని సిక్కిం హైకోర్టుకు బదిలీ చేయనున్నారని సమాచారం. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల్ని ఒకేసారి బదిలీ కావడమనేది ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ హైకోర్టుకు ప్రభుత్వానికి ( Ap government ) మధ్య జరుగుతున్న ప్రఛ్చన్న యుద్ధం కూడా ఛీఫ్ జస్టిస్ బదిలీ వ్యవహారానికి కారణమా అనే వాదన నడుస్తోంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఢిల్లీ పర్యటనకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు బదిలీకి సంబంధముందనేది సీపీఐ నేత నారాయణ లాంటి వ్యక్తులు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. Also read: AP SEC: ఆ ఇంటి విషయంలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మోసం చేశారా

Trending News