ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ తనకు ప్రాణహాని ఉందని సంచలన ప్రకటన చేశారు. ఓ ప్రముఖ మీడియా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తనకు ఇద్దరు వ్యక్తులతో ప్రాణహాని ఉందని.. ఒకరు అధికార పార్టీ చంద్రబాబు అయితే.. రెండోది ప్రతిపక్ష నేత జగన్ అని సంచలన ఆరోపణలు చేశారు. ఇరువురి అవినీతిపై బహిరంగం మాట్లాడుతున్నంకే తనను హతమార్చాలని చూస్తున్నారని కేఏ పేర్కొన్నారు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

న్యాయస్థానం చెప్పినా వినడం లేదు..


ఈ విషయాన్ని చంద్రబాబుతో పాటు రాష్ట్ర హోంశాఖకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని..దీంతో  హైకోర్టు ఆశ్రయించామన్నారు. సెక్యూరిటీ కేటాయించాలని న్యాయస్థానం చెప్పినప్పటికీ ఇప్పటి వరకు ఆ పనిచేయలేదన్ననారు. పదే పదే అడిగినప్పటికీ తనకు సెక్రూరిటీ కల్పించకపోవడం ఏంటని ప్రశ్నించారు.


ప్రపంచ దూతగా ఉన్న తనకు సెక్యూరిటీ ఎందుకు ఇవ్వరు ?


ఒక మతానికి చెందిన గురువుగా.. ప్రపంచ దూతగా ఉన్న తనకు సెక్యూరిటీ కల్పించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని కేపీ పాల్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ గురించి ప్రస్తావిస్తూ ఒక వేళ తనను చంద్రబాబు హతమార్చకపోతే .. జగన్ ఆ పని చేసే అవకాశముందని ఆరోపించారు. జగన్ తనను హతమార్చి ఆ కుట్రను చంద్రబాబుపై నెట్టి సానుభూతి క్యాచ్ చేసుకునే అవకాశముందని కేఏ పాల్ ఆరోపించారు


ఖండిస్తున్న పార్టీ శ్రేణులు...


ప్రజాశాంతి పార్టీ వ్యవస్థపకుడి హోదా ఇటీవలికాలంలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ కేఏ పాల్ వార్తల్లో నిలుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించిన ఆయన.. ఏపీ సీఎం చంద్రబాబు, జగన్ లు రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆయన పదే పదే విమర్శిస్తున్నారు.తమ పార్టీ అధికాంలోకి వస్తే అవినీతి రహితంగా తీర్చిదిద్దుతామని వ్యాఖ్యనిస్తున్నారు..ఇదిలా ఉండగా ఈ ఆరోపణలను ఇరు పార్టీల శ్రేణులు ఖండిస్తున్నారు. సంచలనం కోసమే కేఏ పాల్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు తప్పితే ఇందులో వాస్తవం లేదని కొట్టిపారేస్తున్నారు.