బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ వైసీపీలో చేరడంపై నీలినీడలు కమ్ముకున్న విషయం తెలిసిందే. నాటకీయ పరిణామాల మధ్య ఆయన వైసీపీలో చేరిక అంశం పోస్ట్‌పోన్ అయింది. దీంతో కన్నా వైసీపీలో చేరికకు బ్రేక్ పడినట్లు వార్తలు వెలువడ్డాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కన్నా వైసీపీలో చేరేందుకు సిద్ధమై తేదీ కూడా ఖరారు చేసుకున్నారు. అయితే అదే రోజున ఆయన అనారోగ్యానికి గురవ్వడం.. ఆస్పత్రిలో అడ్మిట్ అవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. 


కన్నా వెనక్కి తగ్గారని.. అనారోగ్యం పేరుతో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారనే పుకార్లు వినిపించాయి. బీజేపీ చీఫ్ అమిత్ షా రంగంలోకి దిగి కన్నాను బుజ్జగించారనే వార్తలు కూడా చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఇక వైసీపీలో చేరబోరని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కన్నా వర్గానికి చెందిన కొందరు .. తమ నేత వైసీపీలో చేరడం ఖాయమని వెల్లడించారు. జగన్‌తో మాట్లాడి మరో తేదీని ఖరారు చేసుకుంటామని పేర్కొన్నారు. కన్నా వైసీపీలో చేరే రోజు భారీగా ర్యాలీ నిర్వహిస్తామని పేర్కొన్నారు. 


బీజేపీ రాష్ట్ర పగ్గాలు ఆశించిన కన్నాకు అధిష్టానం మొండి చేయిచూపింది. దీనికి తోడు పార్టీలో తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే భావనలో ఉన్న కన్నా ఇటీవలే బీజేపీకి రాజీనామా చేశారు. ఇప్పుడు వైసీపీలో చేరి సరికొత్త పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని కన్నా భావిస్తున్నారు.