Kodali Nani Counter to Pawan Kalyan: కోనసీమ జిల్లా పేరు మార్పు వివాదం హింసాత్మక ఘటనలకు దారితీయడం రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఈ హింసాత్మక ఘటనల వెనుక టీడీపీ, జనసేన పార్టీల కుట్ర ఉందని వైసీపీ బలంగా ఆరోపిస్తోంది. మరోవైపు, ఇదంతా అధికార పార్టీ డైరెక్షన్‌లోనే జరిగిందంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపిస్తున్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం అక్కడ గొడవలు జరిగేలా చేసింది వైసీపీనే అని పవన్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో పవన్‌ వ్యాఖ్యలకు తాజాగా కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సినిమాలు చేసుకోవడం, ఎవరైనా స్క్రిప్ట్ రాసిస్తే చదవడం తప్పించి సొంత ఆలోచన లేని వ్యక్తి పవన్ కల్యాణ్ అని కొడాలి నాని విమర్శించారు. కోనసీమ జిల్లా పేరు మార్పుపై అభ్యంతరాలకు నెల రోజులు గడువును పవన్ తప్పు పట్టడాన్ని ఖండించారు. భారత రాజ్యాంగం ప్రకారం అభ్యంతరాలకు గడువు ఇచ్చామని... ప్రొసీజర్ పట్ల కనీస అవగాహన లేని చవట దద్దమ్మలు రాజకీయాల్లోకి వచ్చారని విమర్శించారు. పిల్లలను రెచ్చగొట్టి రోడ్డెక్కించి అక్కడ కాల్పులు జరిపే పరిస్థితి తీసుకొచ్చారని... పైగా లా అండ్ ఆర్డర్ కాపాడలేకపోయారంటూ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.


ఆ సమయంలో శాంతిభద్రతలు అదుపులోకి తీసుకురావాలంటే పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చేదని... కానీ ప్రాణనష్టం జరగకూడదనే ఉద్దేశంతో పోలీసులు ఫైరింగ్ చేయలేదని కొడాలి నాని పేర్కొన్నారు. ఒకవేళ ఫైరింగ్ జరిగి ఉంటే చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు ఈపాటికే దాన్ని రాజకీయం చేసేందుకు బయలుదేరి ఉండేవారని విమర్శించారు. అంబేడ్కర్‌ను వ్యతిరేకించేవాళ్లను దేశ బహిష్కరణ చేయాలని.. జైళ్లలో పెట్టాలని డిమాండ్ చేశారు. జనసేన కార్యకర్తలంతా నిక్కర్లు వేసుకునే బుడ్డోళ్లని... వారిని రెచ్చగొట్టి పవన్ కల్యాణ్ పబ్బం గడుపుకుంటున్నారని ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజా సంక్షేమమే ముఖ్యమని పేర్కొన్నారు.


Also Read: CM Kcr comments: త్వరలో సంచలనాలు..బెంగళూరులో సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!


Also Read: Banking Rules: నేటి నుంచి కొత్త రూల్స్... ఆ పరిమితి దాటే లావాదేవీలకు ఆధార్, పాన్ తప్పనిసరి... 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి