Konaseema Tension: ఏపీలో జిల్లాల పునర్విభజనలో భాగంగా అమలాపురం పార్లమెంటు స్థానాన్ని కోనసీమ జిల్లాగా ఏర్పాటుచేసింది వైసీపీ సర్కార్. దీనిపై అప్పట్లో పెద్ద అభ్యంతరాలేమీ రాలేదు. అయితే ఇటీవల జిల్లాపేరును అంబేద్కర్ జిల్లాగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఇక అప్పటినుంచి జిల్లాలో ఆందోళనలు మొదలయ్యాయి. కోనసీమ పేరులోనే ప్రత్యేకత ఉందని.. ఆ ప్రత్యేకతను అలాగే ఉంచాలని డిమాండ్లు ఊపందుకున్నాయి. పేరుమార్పును నిరసిస్తూ మంగళవారం జేఏసీ నేతలు అమలాపురంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు కలెక్టరేట్ వైపు వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడం హింసాత్మక పరిణామాలకు దారితీసింది. ఆందోళనకారుల రాళ్లదాడి, పోలీసుల లాఠీఛార్జి మధ్య అమలాపురంలో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. ఆందోళనకారుల రాళ్లదాడిలో జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. మంత్రి పినిపె విశ్వరూప్ ఇంటివద్ద ఆందోళనకారులు పెను విద్వంసంసృష్టించారు. ఆయన ఇంటితో పాటు కార్లకు నిప్పుపెట్టారు. ముమ్మడివరం వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఇంటిని సైతం అగ్నికి ఆహుతిచేశారు. కోనసీమ ఉద్రిక్తతలు అధికారప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. విపక్షాలే ఆందోళనకారులను రెచ్చగొడుతున్నాయని అధికార పార్టీ నేతలు ఆరోపించారు.
కోనసీమ ఉద్రిక్తలపై స్పందించారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్. ఈ ఆందోళనలు విచారకరమని ప్రజలందరూ సంయమనం పాటించాలని విజ్ఞప్తిచేశారు. శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు అందరూ సహకరించాలన్నారు. ప్రజాస్వామ్యవాదులందరూ ఈ ఉద్రిక్తతలను ఖండించాలన్నారు. అంబేద్కర్ పై ప్రతిఒక్కరికీ గౌరవభావం ఉందని... ఆయన పేరును వివాదాలకు కేంద్రబిందువుగా మార్చడం దురదృష్టకరమన్నారు. మహనీయుని పేరు వివాదాల్లోకి తీసుకొచ్చిన రాష్ట్రప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలన్నారు. అమలాపురంలో ఉద్రిక్తతలను అదుపుచేయడంలో అధికార పార్టీ విఫలమైందన్నారు. శాంతిభద్రతలను పరిరక్షించడంలో వైసీపీ సర్కార్ ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. వైసీపీ పాలనాలోపాను కప్పిపుచ్చుకునేందుకు లేని సమస్యలు సృష్టిస్తున్నారని పవన్ ఆరోపించారు. ఈ ఉద్రిక్త పరిస్థితులకు బీజం వేసిందెవరో జిల్లాతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. హోంమంత్రి తానేటి వనిత జనసేన పేరు ప్రస్తావించడాన్ని పవన్ తీవ్రంగా ఖండించారు. వైసీపీ ప్రభుత్వ లోపాలు, అసమర్థతనను , వైఫల్యాలను జనసేనపై రుద్దొద్దని స్పష్టంచేశారు.
Also read : MLC Anantha Babu: డ్రైవర్ ను నేనే కొట్టి చంపా.. అంగీకరించిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి