Konaseema Protests Turns Violent: కోనసీమ జిల్లా పేరు మార్పు వివాదం తారాస్థాయికి చేరింది. జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం (మే 24) చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. పోలీసులపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్లకు నిప్పంటించారు. మంత్రి ఇంట్లోని 3 కార్లను తగలబెట్టారు. రోడ్డుపై పలు ప్రైవేట్ వాహనాలకు కూడా నిప్పంటించారు. ఈ పరిణామాలతో కోనసీమలో ఎప్పుడేం జరుగుతుందోనన్న హైటెన్షన్ వాతావరణం నెలకొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమలాపురం బ్యాంకు కాలనీలోని మంత్రి విశ్వరూప్ నివాసం వద్దకు మంగళవారం మధ్యాహ్నం ఆందోళనకారులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆయన ఇంటిని ముట్టడించి నిప్పంటించారు. అక్కడే పార్క్ చేసి ఉన్న వాహనాలను కూడా తగలబెట్టారు. అదే సమయంలో అమలాపురం హౌసింగ్ బోర్డు కాలనీలోని ఎమ్మెల్యే సతీష్ ఇంటిని కూడా ఆందోళనకారులు ముట్టడించారు. ఆయన ఇంటికి కూడా నిప్పంటించారు.


ఈ పరిణామాలపై స్పందించిన మంత్రి విశ్వరూప్... జరిగిన ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీలు యువతను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నాయని ఆరోపించారు. అన్ని పార్టీలు కోరితేనే కోనసీమకు అంబేడ్కర్ జిల్లాగా పేరు పెట్టామన్నారు. తీరా ఇప్పుడు విపక్ష పార్టీలు మాట మార్చాయని ఫైర్ అయ్యారు. ఇకనైనా అంతా సంయమనం పాటించాలని... అభ్యంతరాలు పరిశీలిస్తామని విజ్ఞప్తి చేశారు. 


కోనసీమలో హింసాత్మక ఘటనలపై హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. అక్కడి ప్రజల అభీష్టం మేరకే జిల్లాకు అంబేడ్కర్ జిల్లాగా పేరు పెట్టామన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా గొడవలు, అల్లర్లు సృష్టిస్తున్నారని... వారి వెనుక ఉండి నడిపించేవారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు కొన్ని శక్తులు కుట్రలకు పాల్పడుతున్నాయన్నారు. 
 



Also Read: High Tension in Amalapuram: అమలాపురంలో హైటెన్షన్... ఎస్పీ వాహనంపై రాళ్ల దాడి.. ఆందోళనకారులపై లాఠీఛార్జి


Also Read: Numerology Radix: పవర్‌ఫుల్ ర్యాడిక్స్ 8.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఈ ఏడాదంతా అదృష్టమే...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook