Numerology Radix: పవర్‌ఫుల్ ర్యాడిక్స్ 8.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఈ ఏడాదంతా అదృష్టమే...

Nature By Numerology Radix: న్యూమరాలజీ ప్రకారం ఒక వ్యక్తి ర్యాడిక్స్‌ను బట్టి అతని భూత, వర్తమాన, భవిష్యత్ స్థితి గతులను తెలుసుకోవచ్చు. అంతేకాదు, ఆ వ్యక్తుల స్వభావాన్ని కూడా ర్యాడిక్స్ తెలియజేస్తోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 24, 2022, 04:46 PM IST
  • న్యూమరాలజీలో ర్యాడిక్స్‌కి చాలా ప్రాధాన్యత
  • ర్యాడిక్స్ ఆధారంగా వ్యక్తి స్థితి గతులు చెప్పొచ్చు
  • ఇవాళ ర్యాడిక్స్ 8 గురించి ఇక్కడ తెలుసుకుందాం...
Numerology Radix: పవర్‌ఫుల్ ర్యాడిక్స్ 8.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఈ ఏడాదంతా అదృష్టమే...

Nature By Numerology Radix: జ్యోతిష్యం లాగే న్యూమరాలజీ ద్వారా కూడా ఒక వ్యక్తి స్థితి గతులను అంచనా వేయొచ్చునని న్యూమరాలజీ నిపుణులు చెబుతుంటారు. ఆ వ్యక్తుల స్వభావం, ఇష్టాయిష్టాలు, కెరీర్, వైవాహిక జీవితం, తదితర విషయాలన్నీ న్యూమరాలజీ ద్వారా తెలుసుకోవచ్చునని చెబుతారు. ఒక వ్యక్తి ర్యాడిక్స్ ఆధారంగా వీటిని తెలుసుకోవచ్చునని చెబుతారు. న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా సరే  8, 17, 26 తేదీల్లో జన్మించే వ్యక్తులు ర్యాడిక్స్‌ నంబర్ 8 కలిగి ఉంటారు. 2022 సంవత్సరం ఈ ర్యాడిక్స్ నంబర్ 8 వారికి చాలా శుభప్రదమని న్యూమరాలజీ చెబుతోంది. న్యూమరాలజీ ప్రకారం ఈ వ్యక్తుల స్వభావం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం... 

న్యూమరాలజీ ప్రకారం.. ర్యాడిక్స్ నంబర్ 8 శక్తివంతమైనది. దీనికి శని గ్రహం అధిపతి. ఈ ర్యాడిక్స్ నంబర్ కల వ్యక్తుల స్వభావం ప్రశాంతంగా ఉంటుంది. వీరు మనసులో ఏదైనా నిశ్చయించుకున్నారంటే... ఆ పనిని తప్పక పూర్తి చేస్తారు. మొండిపట్టుదల వీరిలో కాస్త ఎక్కువే.

తమది కాని పనుల్లో వీరు జోక్యం చేసుకోరు. ఇతర పనుల్లో జోక్యం అస్సలు ఇష్టం ఉండదు. వీరు మాటకు కట్టుబడి ఉండే వ్యక్తులు. కొన్నిసార్లు వీరి మొండి స్వభావం కారణంగా కుటుంబంలో ఉద్రిక్తతలు ఏర్పడవచ్చు. దీనివల్ల కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. 

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ర్యాడిక్స్ 8 కలిగినవారు వ్యాపారంలో సిద్ధహస్తులు. వ్యాపారాన్ని పరుగులు పెట్టించగలరు. సహజంగానే ఈ వ్యక్తులు చాలా కష్టపడి పనిచేస్తారు. ఏ పని చేసినా అంకితభావం, ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. కాబట్టి చేపట్టిన ప్రతీ పనిలో విజయం సాధిస్తారు.

ర్యాడిక్స్ 8లోని మరో ప్రత్యేకత ఏంటంటే.. వీరు ఎవరినైనా తమ ప్రతిభతో ఆకర్షించగలరు. వ్యాపార రంగంలో వీరి రాణింపు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తోచిన మేరకు ఇతరులకు కూడా ఎప్పుడూ సాయపడుతుంటారు. 

(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: AB de Villiers IPL: ఆర్‌సీబీ అభిమానులకు శుభవార్త.. ఏబీ డివిలియర్స్ వచ్చేస్తున్నాడు! అసలు ట్విస్ట్ ఏంటంటే

Also Read: GT vs RR Playing XI: క్వాలిఫయర్-1‌‌లో టాప్ జట్ల మధ్య పోటీ.. అందరి కళ్ళు ఆ ఇద్దరిపైనే! తుది జట్లు ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News