Krishna lanka Safe: విజయవాడలో ఉండేవారందరికీ కృష్ణలంక గురించి తెలియకుండా ఉండదు. నదికి ఆనుకుని ఉండే ప్రాంతమది. నదీ ప్రవాహం పెరిగే కొద్దీ ముందుగా ఆందోళన కలిగేది వీరికే. కృష్ణలంకతో పాటు 13-14 ప్రాంతాలకు ఇదే పరిస్థితి. కానీ కృష్ణా నది కరకట్ట దాటి ప్రవహిస్తున్నా తొలిసారి సురక్షితమైంది. ఆ రిటైనింగ్ వాల్ కంచుగోడలా నిలిచి కాపాడింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కృష్ణా నదికి ఎప్పుడు వరదలు వచ్చినా ముందుకే కలవరపడేది. మునిగేది కృష్ణలంకతో పాటు పరిసర ప్రాంతాలు. నదికి ఆనుకుని ఉండే ఈ ప్రాంతంలో కేవలం 3 లక్షల క్యూసెక్కుల నీటికే ఈ ప్రాంత ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. కృష్ణలంక, రాణిగారి తోట, రామలింగేశ్వరనగర్, కోటినగర్, పోలీస్ కాలనీ, రణదీవె నగర్, గౌతమి నగర్, నెహ్రూ నగర్, చలసాని నగర్, గీతా నగర్, బాలాజీ నగర్, ద్వారకా నగర్, భ్రమరాంబ నగర్, తారకరామ నగర్ ప్రాంతాలు నీట మునిగిపోయేవి. దాదాపుగా లక్షమంది ఇళ్లు వదిలి పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. 


కానీ ఈసారి కృష్ణలంకతో పాటు ఈ ప్రాంతాలు సేఫ్‌గా నిలిచాయి. కృష్ణా నదిలో 11 లక్షల 30 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నా అందరూ సురక్షితంగా ఉన్నారు. కారణం గత ప్రభుత్వ హయాంలో అంటే వైఎస్ జగన్ హయాంలో దాదాపు 474 కోట్ల ఖర్చుతో నిర్మించిన రిటైనింగ్ వాల్. అంటే కృష్ణా నదిని ఆనుకుని పద్మావతి ఘాట్ నుంచి యనమల కుదురు వరకు మూడు దశల్లో 5.56 కిలోమీటర్ల పొడవున నిర్మించిన రక్షణ గోడ. 12 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించినా ఈ ప్రాంతంలో చుక్కనీరు రాకుండా నిర్మించారు. 


ఇప్పుడు అందుకే కృష్ణలంక తొలిసారి సేఫ్ అయింది. అందరూ నిశ్చింతగా పడుకున్నారు. భారీ వరద చుట్టుముట్టినా ఆ భయమే లేకుండా ఉన్నారు. ఎప్పుడూ వరద చుట్టుముట్టే ప్రాంతాలు ఈసారి సేఫ్ అయితే ఎన్నడూ వరద చూడని ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. 


Also read: Rain Alert: ఏపీకు బిగ్ అలర్ట్, సెప్టెంబర్ 5 వరకు భారీ వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.