ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన ' మీట్ ద ప్రెస్' కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ పరిపాలనకు సంబంధించిన అనేక విషయాలపై స్పందిచారు. దేశంలోనే సీఎం కేసీఆర్ అద్భుత పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంలో రాజకీయ అంశాలపై స్పందిస్తూ చంద్రబాబు వైఖరిని తప్పుబట్టారు. పక్క రాష్ట్రానికి చెందిన సీఎం.. తమ పరిపాలన విషయంలో తలదుర్చడం సరికాదన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ పాలన - తెలంగాణ పాలనకు పోలికే లేదన్నారు. ఇక్కడ అమలు చేస్తున్న రైతు బంధు, మిషన్ బగీరథ లాంటి ప్రతిష్ఠాత్మక పథకాలు అక్కడ అమలు చేస్తున్నారా ? అని ప్రశ్నించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏపీలో అమలు చేయగలరా ? అంటూ  ఈ సందర్భంగా చంద్రబాబును ప్రశ్నించారు. 


చంద్రబాబు సిద్ధాంతాలు, విలవలు అంటూ ఏమీ ఉండవన్నారు. రాజకీయ అవసరాలే ఆయనకు ముఖ్యమని విమర్శించారు. చంద్రబాబు ఏనాడు ఒంటరిగా పోటీ చేయలేదని.. ఓడిపోతామన్న భయంతోనే ఆయన ఏదో ఒక పార్టీతో పొత్తుపెట్టుకుంటారని విమర్శించారు. మొన్న బీజేపీ, ఈ రోజు  కాంగ్రెస్, ఒకప్పుడు టీఆర్ఎస్, వామపక్షాలు ఇలా అన్ని పార్టీలతో ఆయన పొత్తు పెట్టుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ క్రమంలో మాట్లాడుతూ ఇక మిగిలిచింది వైసీపీ పార్టీయే నని..అవసరమైతే చంద్రబాబు వైసీపీతో పొత్తుపెట్టుకుంటారని  తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎద్దేవ చేశారు.