Leopard Attack in Tirumala: తిరుమల రెండో ఘాట్ రోడ్లో చిరుత కలకలం సృష్టించింది. తిరుపతి నుంచి తిరుమలకు బైక్ పై చిరుత దాడి చేసింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న టీటీడీ అధికారులు హుటాహుటిగా సంఘటనా స్థలానికి చేరుకొని.. గాయపడ్డ వారి వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏం జరిగిందంటే?


తిరుమలలోని వరాహస్వామి కాటేజీలో పనిచేస్తున్న రామకృష్ణారెడ్డి, ఆనందయ్య విధులకు హాజరయ్యేందుకు బుధవారం రాత్రి తిరుపతి నుంచి బైక్‌పై తిరుమలకు బయలుదేరారు. రాత్రి 7 గంటల సమయంలో వినాయక స్వామి ఆలయం దాటిన తర్వాత రోడ్డు దాటేందుకు వెళుతున్న ఓ చిరుత బైక్‌పైకి దూకింది. చిరుత రాకను గమనించిన రామకృష్ణారెడ్డి, ఆనందయ్య బైక్‌ ఆపకుండా వేగంగా ముందుకెళ్లారు.


బైక్‌పై స్పీడుగా వెళ్లే క్రమంలో ఆ చిరుత కాలి గోర్లు తగలడం వల్ల వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే అక్కడికి చేరుకున్న టీటీడీ సిబ్బంది ఇద్దర్ని ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. ఇద్దరికీ చిన్న గాయాలే అయ్యాయని కంగారు పడాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెప్పారు. 


తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత దాడి జరగడం వల్ల విజిలెన్స్ అధికారులు భక్తులను హెచ్చరించారు.. వాహన దారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గతంలో కూడా ఘాట్ రోడ్డులో చిరుత భక్తులపై దాడి చేసిన ఘటనలు ఉన్నాయి.  


Also Read: APSRTC Bus Accident: ఏపీఎస్ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ఏపీ సీఎం


Also Read: Breaking News: వాగులో పడిన ఆర్టీసీ బస్సు- 10 మంది ప్రయాణికులు మృతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook