Zee News Matrize Opinion Poll: ఏపీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు..? జీ న్యూస్ సర్వేలో పట్టం ఎవరికంటే..!
Zee News Matrize Opinion Poll on AP Elections: ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రానుంది..? కేంద్ర బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా..? తెలంగాణలో బీఆర్ఎస్ తిరిగి పుంజుకుంటుందా..? దేశవ్యాప్తంగా ఓటర్లు ఏం చెబుతున్నారు..? ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు మ్యాట్రిజ్ సంస్థతో జీ న్యూస్ నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Zee News Matrize Opinion Poll on AP Elections: సార్వత్రిక ఎన్నికల నగారా మోగిన వేళ అందరి దృష్టి తెలుగు రాష్ట్రాలపై పడింది. ఏపీలో అధికారం ఎవరికి దక్కుతుందనే విషయంపై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. వైనాట్ 175 అంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ప్రభంజనం స్పష్టిస్తారా.. లేక సూపర్ సిక్స్‌తో చంద్రబాబు టీమ్ సునామీ చేయబోతుందా అన్నది ఆసక్తిగా మారింది. టీడీపీ-జనసేన కూటమికి బీజేపీ జత కట్టడంతో అంచనాలు తారుమారు అయ్యాయనే టాక్ వస్తోంది. ఇక తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటుతుందా లేక మోడీ మేజిక్ బీజేపీ తెలంగాణలో సంచలనం చేయబోతుందా.. కేసీఆర్ తన ఎత్తులతో మళ్లీ ఫామ్‌లోకి వస్తారా అన్నది ఆసక్తిగా మారింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌కు ముందు దేశవ్యాప్తంగా ఓటర్ల మూడ్ తెలుసుకునే ప్రయత్నం చేసింది జీన్యూస్. మ్యాట్రిజ్ సంస్థతో కలిసి నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో ఊహించని ఫలితాలు వచ్చాయి. జీ న్యూస్ సర్వేలో ఎలాంటి ఫలితం వచ్చిందో ఇప్పుడు చూద్దాం.. లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
Latest Updates
AP Assembly Elections 2024: గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఓట్ల శాతంలో మార్పు
==> YSRCP -1.8%
==> టీడీపీ-బీజేపీ-జనసేన +2.6%
==> కాంగ్రెస్ -0.1%
==> ఇతరులు -0.7%
AP Assembly Elections 2024: అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు?
==> YSRCP 77-92
==> టీడీపీ-బీజేపీ-జనసేన 72-87
==> కాంగ్రెస్ 00
==> ఇతరులు 00AP Lok Sabha Elections 2024: ఆంధ్రప్రదేశ్ లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు..?
==> YSRCP 12
==> RTDP+BJP+Janasena 13
==> కాంగ్రెస్ 00
==> ఇతరులు 00
AP Lok Sabha Elections 2024: ఏపీ లోక్‌సభ ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారు..?
==> YSRCP 47.6%
==> టీడీపీ-బీజేపీ-జనసేన 48.5%
==> కాంగ్రెస్ 1.5%
==> ఇతరులు 2.4%AP Assembly Elections 2024: అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేస్తారు..?
==> YSRCP 48.8%
==> టీడీపీ-బీజేపీ-జనసేన 48.8%
==> కాంగ్రెస్ 1.1%
==> ఇతరులు 1.3 %AP Assembly Elections 2024: ఏ ముఖ్యమంత్రి పనితీరు బాగుందని భావిస్తున్నారు?
==> వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 27%
==> చంద్రబాబు నాయుడు 24%
==> వైఎస్ రాజశేఖర రెడ్డి 38%
==> ఇతర అంశాలు 11%
AP Assembly Elections 2024: టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు సక్సెస్ అవుతుందని భావిస్తున్నారా ?
==> అవుతుంది 41%
==> కొంత వరకు 26%
==> కాదు 21%
==> ఇప్పుడే చెప్పలేం 12%AP Assembly Elections 2024: ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ పాత్ర ఎలా ఉంది?
==> చాలా బాగుంది 31%
==> ఫర్వాలేదు 36%
==> అసలు బాగాలేదు 31%
==> చెప్పలేం 02%
AP Assembly Elections 2024: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పని తీరు ఎలా ఉంది..?
==> చాలా బాగుంది 28%
==> ఫర్వాలేదు 38%
==> అసలు బాగాలేదు 32%
==> చెప్పలేం 02%Telangana Lok Sabha Elections 2024: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు..?
==> కాంగ్రెస్ 9
==> బీజేపీ 5
==> బీఆర్ఎస్ 2
==> ఎంఐఎం 1
Telangana Lok Sabha Elections 2024: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారు?
==> కాంగ్రెస్ 40.4%
==> బీజేపీ 22.6%
==> బీఆర్ఎస్ కూటమి 28.1%
==> ఎంఐఎం 3.3%
==> ఇతరులు 5.6%