ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై కరోనా వైరస్ ప్రభావం పడింది. స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ప్రకటన చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read Also: అప్పుడే పుట్టిన బిడ్డకు కరోనా వైరస్..!!


'కరోనా వైరస్'  విస్తరిస్తున్న ప్రస్తుత సమయంలో ఎన్నికలు నిర్వహిస్తే.. చాలా మందికి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ అన్నారు. అందుకే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఎన్నికల ప్రక్రియను ప్రస్తుతానికి వాయిదా వేశామని తెలిపారు. కొద్ది రోజుల తర్వాత మళ్లీ ఎన్నికల తేదీలను ప్రకటిస్తామని వివరించారు. ఐతే ఇప్పటి వరకు ఏకగ్రీవం అయిన వారికి ఎలాంటి నష్టం లేదని.. వారు అలాగే కొనసాగుతారని తెలిపారు.  ఎన్నికలను  వాయిదా వేశాం.. కానీ పూర్తి ప్రక్రియను నిలిపివేయలేదని.. రద్దు చేయలేదని వివరించారు రమేష్ కుమార్. 


Read Also: ట్రంప్ అన్నంత పనీ చేశారు..!!   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..