పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న నారా లోకేష్ మరింత దూకుడు పెంచి ప్రజా క్షేత్రంలోకి వెళ్లాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమౌతున్నారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు తన యాత్రకు సంబంధించిన ప్రణాళికలు రూపొందిస్తున్నారు.  వారంలో మూడు రోజులు అధికారిక కార్యక్రమాలు.. మరో మూడు రోజులు పర్యటనలు చేయాలని లోకేష్ షెడ్యూల్ రూపొందించుకున్నట్లు సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లోకేష్ తన పర్యటన ద్వారా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షే పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లటంతో పాటు సమస్యలకు పరిష్కారం చూపనున్నారు. అలాగే జగన్, పవన్ చేస్తున్న టీడీపీ వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టాలని భావిస్తున్నారు. తన యాత్ర ద్వారా జిల్లాల వారీగా పార్టీని బలోపేతం చేసేలా ప్రణాళిక రూపొందించుకున్నారు. జిల్లా స్థాయి నేతలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి లోటుపాట్లను సరిదిద్దనున్నారు. దీంతో పాటు ధర్మపోరాట సభలను సైతం ఇకపై నెలకు ఒకటి లేదా రెండు పెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది.