Loksabha Election Results 2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలొచ్చాయి. కూటమి భారీ విజయం ముందు ఫ్యాన్ కొట్టుకుపోయింది. ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి 164 సీట్లను దక్కించుకోగా వైసీపీ కేవలం 11 స్థానాల్లో విజయం సాధించింది. ఇక లోక్‌సభ స్థానాల్లో కూడా కూటమి పైచేయి సాధించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు ఓ శరాఘాతంలా తగిలాయి. కేవలం 11 అసెంబ్లీ స్థానాలు గెల్చుకుంది. మంత్రివర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా అందరూ ఓటమి పాలయ్యారు. పార్లమెంట్ ఎన్నికల విషయానికొస్తే గత ఎన్నికల్లో 22 ఎంపీ స్థానాల్ని గెల్చుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈసారి కేవలం 4 స్థానాలకు పరిమితమైంది. కడప, రాజంపేట, తిరుపతి, అరకు స్థానాలు మాత్రమే వైసీపీకు దక్కాయి. కడప, రాజంపేట స్థానాల్నించి వైఎస్ అవినాష్ రెడ్డి, పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిలు హ్యాట్రిక్ విజయం సాధించారు. ఎవరికెన్ని ఓట్లు, ఎంతెంత మెజార్టీ వచ్చిందో తెలుసుకుందాం.


కడప పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 12,97,362 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్ది అవినాష్ రెడ్డి 5,97,101 ఓట్లు సాధించి సమీప టీడీపీ అభ్యర్ధి భూపేష్ రెడ్డిపై 65,490 ఓట్ల మెజార్టీ సాధించారు. ఇక కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన వైఎస్ షర్మిలకు 1,35,731 ఓట్లు వచ్చాయి. వైఎస్ అవినాష్ రెడ్డి కడప పార్లమెంట్ నుంచి వరుసగా 2014, 2019, 2024లో గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 


ఇక రాజంపేట నుంచి వైసీపీ అభ్యర్ధి పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి సమీప బీజేపీ అభ్యర్ది, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై 76,071 ఓట్ల తేడాతో విజయం సాధించారు. రాజంపేట పరిధిలోని రాజంపేట, రాయచోటి, పీలేరు, తంబళ్లపల్లె, రైల్వేకోడూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మిధున్ రెడ్డి పట్టు సాధించారు. మొదటిసారి 2014లో అప్పటి బీజేపీ అభ్యర్ధి పురంధరేశ్వరిపై విజయం సాధించారు. 2019లో టీడీపీపై గెలిచారు. ఇప్పుుడు వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు.


ఇక తిరుపతి నుంచి ఎంపీ డాక్టర్ గురుమూర్తి మరోసారి విజయం సాధించారు. ఈయన తన సమీప బీజేపీ అభ్యర్ది వరప్రసాద్‌పై 14,569 ఓట్ల ఆధిక్యం సాధించారు. వైసీపీ అభ్యర్ది గురుమూర్తికి మొత్తం 6,32,228 ఓట్లు లభించాయి. 


ఇక ఎస్టీ నియోజకవర్గమైన అరకుపై వైసీపీ మరోసారి తన పట్టు నిలుపుకుంది. అరకు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్ధిని డాక్టర్ గుమ్మ తనూజా రాణి విజయం సాధించారు. తన సమీప బీజేపీ అభ్యర్ధి కొత్తపల్లి గీతపై 50,580 ఓట్ల మెజార్టీ సాధించారు. తనూజా రాణికి మొత్తం 4,77,005 ఓట్లు పోలయ్యాయి.


Also read: AP Assembly Results 2024: ఏపీ ఎన్నికల్లో జనసేన క్లీన్‌స్వీప్, పవన్ సహా ఎవరి మెజార్టీ ఎంత



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook