Heavy Rains: తూర్పు మధ్య బంగాళాఖాతంలో మయన్మార్ తీరానికి ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఫలితంగా రానున్న రెండ్రోజుల్లో వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని ఐఎండీ తెలిపింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వర్షాలు చాలా తక్కువ. జూలైలో ఆశించిన వర్షపాతం నమోదైనా ఆగస్టులో తిరిగి వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. సెప్టెంబర్‌లో ఇప్పటి వరకూ ఏపీలో మోస్తరు వర్షాలు కురిశాయి. ఆశించినమేర వర్షపాతం లేకపోవడంతో రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంది. అయితే వచ్చే మూడు రోజులు ఏపీలో వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ చెప్పడంతో రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. తూర్పు మద్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కారణంగా వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని ఐఎండీ వివరించింది. ఫలితంగా కోస్తాంధ్రలో, రాయలసీమలో రానున్న మూడ్రోజులు మోస్తరు వర్షాలు పడనున్నాయి.


ఇవాళ, రేపు కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకూ అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, శ్రీకాకుళం, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యాయి.


ఇక ఇవాళ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, ఏలూరు, ఎన్టీఆర్, కోనసీమ, అనకాపల్లి, కాకినాడ, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఇతర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడతాయి. బంగాళాఖాతంలో రానున్న 72 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుంది.


Also read: Who is Siddharth Luthra: చంద్రబాబు కేసుతో బిజీ అయిన సుప్రీం కోర్టు అడ్వకేట్.. సుప్రీం కోర్టులో సునితా రెడ్డి పిటిషన్‌పై విచారణ వాయిదా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook