Ap High Court: ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరోసారి ఊరట, జూన్ 5 వరకూ నో అరెస్ట్
Ap High Court: ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల వైసీపీ అభ్యర్ధి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. ఏపీ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ap High Court: ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసాత్మక ఘటనల్లో ఈవీఎం ధ్వంసం సంచలనంగా మారింది. మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్ధి స్వయంగా ఈవీఎంను ధ్వంసం చేసిన దృశ్యాలు చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల కమీషన్ ఆదేశాలతో కేసు నమోదైంది.
ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తంగా మారింది. ఓ పోలింగ్ బూత్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్ధి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా అనుచరులతో కలిసి ఈవీఎంను ధ్వంసం చేసిన దృశ్యాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనమయ్యాయి. ఎన్నికల సంఘం ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టుకు ఉపక్రమించారు. ఈలోగా ఆయన హైకోర్టు నుంచి బెయిల్ తీసుకుని ఉపశమనం పొందారు. అయితే పోలీసులు మరో మూడు కేసులు నమోదు చేయడంతో మరోసారి బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.
జూన్ 4 జరిగే ఓట్ల లెక్కింపు సమయానికి జైలులో ఉండే పోలీసులు ఏదో ఒక కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అత్యవసర పిటీషన్ దాఖలు చేశారు. మే 13 పోలింగ్ రోజునే దాఖలైన పలు ఫిర్యాదులపై డీజీపీ ఆదేశాల మేరకు మంగళగిరి పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పాల్వాయి గేట్ పోలింగ్ బూత్‌లో మహిళను దుర్భాషలాడటం వంటి కేసులు నమోదు చేశారు. ఇవన్నీ కేవలం కక్షసాధింపుతో కౌంటింగ్ రోజున జైలులో ఉండేలా చేసేందుకు అని ఎమ్మెల్యే తరపు న్యాయవాది వాదించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాదనలతో ఏకీభవించిన ఏపీ హైకోర్టు జూన్ 5 వరకూ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశిస్తూ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
Also read: AP Heavy Rains Alert: జూన్ 2 లోగా ఏపీలో నైరుతి రుతుపవనాలు, ఈసారి భారీ వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook