Yaddhanapudi Ayyanna Panthulu Passes Away: విశాఖ పెందుర్తిలోని మహా కామేశ్వరి పీఠం వ్యవస్థాపకుడు యద్ధనపూడి అయ్యన్నపంతులు (87) ఆదివారం (జనవరి 30) కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యద్దనపూడి అయ్యన్న పంతులు ఉత్తరాంధ్రలో శ్రీ విద్యా ఉపాసకుడిగా ప్రసిద్ది చెందారు. శ్రీ శ్రీయానంద నాథస్వామిగా దీక్షానామం ధరించిన ఆయన.. 
కాల సర్పదోషంతో బాధపడేవారికి హోమాదులతో ఉపశమనం కలిగేంచేవారు. అనేక మంది పీఠాధిపతులతో ఆయనకు మంచి అనుబంధం ఉంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక రంగాలలో కృషి చేసినవారిని ప్రతీ ఏటా ఆయన ఘనంగా సత్కరించేవారు. శరన్నవరాత్రుల ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించేవారు.


ప్రతీ ఏడాది విశాఖలో ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేసేవారు. జ్యోతిష్యంలోనూ సిద్దహస్తులైన అయ్యన్న పంతులు.. గతంలో ఏపీ రాజకీయాలపై (AP Politics) కూడా తనదైన జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి, 2018లో విశాఖలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన.. తెలుగు రాష్ట్రాల్లో అప్పటి ప్రభుత్వాలే మళ్లీ అధికారంలోకి వస్తాయని జోస్యం చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కాల సర్ప దోషం ఉందన్నారు.


Also Read: Australian Open 2022: ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నాదల్.. 13 ఏళ్ల తర్వాత గెలుపు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook