NTR District: ఎన్టీఆర్ జిల్లా పేరు చంద్రబాబుకు ఇష్టం లేదా, నాడేం జరిగింది

NTR District: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు కొత్త జిల్లాల అంశం హాట్ టాపిక్‌గా మారింది. కొత్తగా ఏర్పడిన ఎన్టీఆర్ జిల్లా గురించి గతంలో చంద్రబాబు వైఖరిని ఆ ఎమ్మెల్యే బయటపెట్టేశారు. చంద్రబాబుకు ఎన్టీఆర్ జిల్లా పేరు ఇష్టం లేదా..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 30, 2022, 09:02 AM IST
NTR District: ఎన్టీఆర్ జిల్లా పేరు చంద్రబాబుకు ఇష్టం లేదా, నాడేం జరిగింది

NTR District: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు కొత్త జిల్లాల అంశం హాట్ టాపిక్‌గా మారింది. కొత్తగా ఏర్పడిన ఎన్టీఆర్ జిల్లా గురించి గతంలో చంద్రబాబు వైఖరిని ఆ ఎమ్మెల్యే బయటపెట్టేశారు. చంద్రబాబుకు ఎన్టీఆర్ జిల్లా పేరు ఇష్టం లేదా..

ఆంధ్రప్రదేశ్‌లో ఓ వైపు పీఆర్సీపై ఉద్యోగుల సమ్మె..మరోవైపు కొత్త జిల్లాల ఏర్పాటు. కొత్త జిల్లాల విషయంలో కొన్ని ప్రాంతాల్లో స్వల్పపాటి ఆందోళనలు జరుగుతున్నాయి. మార్పులు, చేర్పులతో పాటు సూచనల కోసం నెలరోజుల సమయం ఇచ్చింది ప్రభుత్వం. 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కొత్తగా ఏర్పడిన విజయవాడ కేంద్రంగా ఉన్న జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టారు. ఉగాది నుంచి కొత్త జిల్లాల పాలన ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టడంపై తెలుగుదేశం పార్టీని ఇరుకునపెట్టడమే అధికార పార్టీ లక్ష్యంగా ఉంది. ఎన్టీఆర్ జిల్లా(NTR District) పేరు పెట్టడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. ఎవరూ దీనిపై స్పందించలేదు. ఆ తరువాత ప్రజల్లో ఈ అంశం వైరల్ అవుతుండటాన్ని గమనించి..ఒక్కొక్కరిగా మాట్లాడుతున్నారు. అయితే ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ మాత్రం అధికారికంగా స్పందించలేదు. అటు చంద్రబాబు కూడా మొక్కుబడిగా ఈ విషయంపై స్పందించారు. ఎన్టీఆర్‌ను ఎవరు గౌరవించినా స్వాగతిస్తామని చెప్పారు. 

వాస్తవానికి కొత్త జిల్లాకు ఎన్టీఆర్ (NTR District)పేరు పెట్టడమనేది వైఎస్ జగన్ (Ys Jagan) 2019లోనే తీసుకున్న నిర్ణయం. అప్పట్లో పాదయాత్ర సమయంలో ఎన్టీఆర్ స్వగ్రామంలో పర్యటించిన జగన్..ఎన్టీఆర్ కుటుంబసభ్యులతో మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే..కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని హామీ ఇచ్చారు. అప్పట్లో దీనిపై టీడీపీలో చర్చ కూడా జరిగింది. అయితే ఈ అంశంపై నాడు చంద్రబాబుకు ఇష్టం లేనట్టు తెలుస్తోంది. ఆ విషయాన్ని ఇప్పుడు స్వయంగా ఆ పార్టీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) బయటపెట్టారు. నాడు వైఎస్ జగన్ హామీ ఇచ్చినప్పుడు చంద్రబాబు ఆ విషయంపై ఎలా స్పందించారో వంశీ బహిర్గతపర్చారు.

నాడు చంద్రబాబు స్పందన ఇదీ

మీకు రాజకీయాలు తెలియవు..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాదు. ఏం చేయాలో నాకు తెలుసు..నేను రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని నియమించినవాడిని..

ఇలా కాస్త గట్టిగానే వాదించి..తమ నోళ్లు మూయించారని వల్లభనేని వంశీ స్పష్టం చేశారు. ఇప్పుడు 26 జిల్లాల విషయంలోనూ, ఎన్టీఆర్ జిల్లా పేరు విషయంలోనూ సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తోందని వల్లభనేని వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు ఆ విషయంపై చర్చిస్తే..నోళ్లు మూయించేసి..ఇప్పుడు ఎన్టీఆర్ ఓ ప్రాంతానికి పరిమితమైన వ్యక్తి కాదంటూ కొత్త ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసి..ఏ ఒక్క జిల్లాకు కూడా ఎన్టీఆర్ పేరు పెట్టే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. ఇదంతా చూస్తుంటే ఎన్టీఆర్ జిల్లా పేరు చంద్రబాబుకు (Chandrababu) ఇష్టం లేనట్టే కన్పిస్తోందని టీడీపీలో వాదన ప్రారంభమైంది. ఇష్టముంటే నాడే పెట్టి ఉండేవారు కదా అనేది కొంతమంది వాదన. నాడు జరిగిన విషయాన్ని ఇప్పుడు వంశీ చెప్పడం చూస్తుంటే అదే అర్దమౌతోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే వల్లభనేని వంశీ రాజకీయ కారణాలతో ఈ విషయాన్ని బహిర్గతం చేశారని అనుకున్నా..నాడు టీడీపీలో(TDP) ఇదే అంశంపై చర్చ జరిగిందనేది మాత్రం వాస్తవమే.

Also read: AP Treasury: ట్రెజరీ ఉద్యోగులకు మరో షాక్.. ఆదివారం విధులకు రావాలని ప్రభుత్వ ఆదేశాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News