Manchu Vishnu Supports Pawan Kalyan: ఫిలిం ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ఒకప్పుడు ఎంతో మంచి పేరు ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో మంచు ఫ్యామిలీలో సభ్యులు పైన ..కొంతమంది హీరోలు రాజకీయ.. అభిమానులలో వ్యతిరేకతలు వచ్చిన సంగతి తెలిసిందే. మంచి ఫ్యామిలీ ఎవరితో అన్న విభేదాలు వస్తే వారిపై ఏ రేంజ్ లో రియాక్ట్ అవుతారు.. ఇప్పటికే మనం చూసే ఉన్నాం. ఇక ఇప్పుడు కూడా ఒక విషయంపై రియాక్ట్ అయ్యారు మంచి ఫ్యామిలీ. అయితే ఈసారి.. మొన్నటి వరకు ఎవరికైతే ఆపోజిట్ గా ఉన్నారో వారిని సపోర్ట్ చేస్తూ మాట్లాడడం అందరిని ఆశ్చర్యపరిచింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒకప్పుడు బద్ధ శత్రువులుగా భావించిన పవన్ కళ్యాణ్,  చంద్రబాబు నాయుడులను ఇప్పుడు తండ్రి కొడుకులిద్దరూ సపోర్ట్ చేస్తూ చేసిన ప్రకటనలు చూస్తే అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే..  తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ అయిన నేపథ్యంలో ప్రకాష్ రాజ్ ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ను కోట్ చేస్తూ.. ‘శ్రీవారి లడ్డూ కల్తీ విషయంలో అక్రమానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోండి కానీ దానిపై మతకల్లోలాలు సృష్టించకండి. జాతీయస్థాయిలో వైరల్ చేయాల్సిన అవసరం లేదు’ అంటూ ప్రకాష్ రాజ్ పోస్ట్ చేశారు.


అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని.. మంచు విష్ణు..ప్రకాష్ రాజ్ ను రీ కోట్ చేస్తూ..” పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా పనిచేస్తున్నారు కదా. ఆయనకు ఎక్కడ ఏ విషయం ఎలా చేయాలో తెలుసు. అధికారులతో మాట్లాడి ఆయన త్వరలోనే చర్య తీసుకోబోతున్నారు. ఎవరు ఎక్కడ రంగు పులుముతున్నారో కాస్త దృష్టిలో పెట్టుకొని హద్దులు మీరకుండా ఉంటే చాలు” అంటూ కామెంట్ చేశారు. 


ఇక్కడ పవన్ కళ్యాణ్ కు సపోర్టుగా పలికారు మంచు విష్ణు. వాస్తవానికి మా ఎలక్షన్స్ సమయంలో చిరంజీవి,  పవన్ కళ్యాణ్.. ప్రకాష్ రాజ్ కు పూర్తిస్థాయిలో సపోర్టు పలికారు.  బాలకృష్ణ మంచు విష్ణుకి సపోర్టు పలికారు. అప్పుడు మంచు విష్ణు.. పవన్ కళ్యాణ్ పై కూడా విమర్శలు గుప్పించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు సపోర్టు పలికడం పై కొంత కొంత మంది కొన్ని కొన్ని విధాల స్పందిస్తున్నారు. కొంతమంది ఏమో న్యాయం ఏ పక్క ఉంటే ఆ పక్క నిలవాలి అన్నట్టు.. మంచు విష్ణు కరెక్ట్ గానే రాసుకొచ్చారు అని అంటున్నారు. అయితే మంచు విష్ణు కి ఆపోజిట్ వారు మాత్రం.. ఇదంతా కేవలం కన్నప్ప సినిమా కోసమే అని.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాబట్టి తన సినిమా టికెట్ రేట్ ల కోసం మంచు విష్ణు ఇలా సపోర్ట్ చేస్తున్నారని విమర్శలు కురిపిస్తున్నారు. 


ఇక్కడ మంచు విష్ణు మాత్రమే కాదు మంచు మోహన్ బాబు కూడా గతంలో వైసీపీలో ఉన్నప్పుడు చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ కు..  ముఖ్యమంత్రి అయిన తర్వాత లడ్డు కల్తీ విషయంలో నిన్న మోహన్ బాబు..ఒక ప్రకటన విడుదల చేశారు. ‘నా మిత్రుడు , ఆప్తుడు లడ్డూ కల్తీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. నా మిత్రుడికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని.. ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ ఒక నోట్ వదిలారు. 


ఇలా బద్ధ శత్రువులుగా ఉన్న వీరు ఇప్పుడు వారికే సపోర్టు పలుకుతూ ఉండడం చూసి.. అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎక్కడ ఉంటే అక్కడ ఆ పదం పాడుతున్నట్టు మంచు ఫ్యామిలీ అంటే పడని కొంతమంది నెటిజెన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదేమైనా మోహన్ బాబు, మంచు విష్ణు స్వీట్ చేసింది మాత్రం కరెక్టే అని.. ఎంతోమంది వాళ్లకు మద్దతు పలుకుతున్నారు.


ఇదీ చదవండి: రైల్వే ఉద్యోగాల భారీ నోటిఫికేషన్‌.. 3,445 పోస్టుల భర్తీ..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.