Madanapalle married woman love affair: సాధారణంగా చాలా మంది పెళ్లికున్న పవిత్రను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారు. ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్న వారిని మోసం చేస్తున్నారు. ఇటీవల కాలంలో వివాహేతర బంధాలు తరచుగా వార్తలలో ఉంటున్నారు. కొన్నిచోట్ల భర్తలు తమ భార్యలకు తెలవకుండా దారుణాలకు పాల్పడుతుంటే.. మరికొన్ని చోట్ల భర్తలు కూడా ఆఫీసుల్లో, బైట ఎఫైర్ లు పెట్టుకుంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 




ఇలాంటి ఘటన వల్ల నూరెళ్ల సంసారాన్ని రోడ్డున పడేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వీరి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని చెప్పుకొవచ్చు. ఇలాంటి పనుల వల్ల తమ పరువుతో పాటు, ఇంట్లో వారి పరువు కూడా బజారున పడుతుందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో ఒక షాకింగ్ ఘటన ఏపీలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.


పూర్తి వివరాలు..


అన్నమయ్య జిల్లా మదనపల్లెలో  ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే.. ఇంద్ర అనే యువకుడికి సదరు వివాహితతో ఇన్ స్టాలో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరు తరచుగా మాట్లాడుకునే వారు. భార్య వ్యవహారం అనుమానస్పదంగా ఉండటంతో అతను.. ఆమెపై కన్నేశాడు. ఈ క్రమంలో తన భార్య.. మరోక యువకుడితో ప్రేమాయణం సాగిస్తుందని పసిగట్టాడు.


ఈ క్రమంలో ఒక రోజు ఆమె ప్రియుడు.. సదరు మహిళలను రాత్రి పూట రమ్మనగానే.. ఆమె బైటకు వెళ్లింది. అప్పటికే వీరిపై నిఘాపెట్టిన సదరు యువకుడు.. వీరిద్దర్ని ఎలాగైన పట్టుకొవాలని ప్లాన్ వేశాడు. అప్పటికే తన బంధువులకు సమాచారం ఇచ్చాడు . వీరిద్దరు రాత్రి పూట ఒక ఆస్పత్రి ఆవరణలో మాట్లాడుకుంటుండగా.. అక్కడికి భర్త వెళ్లాడు. ఆమెను నిలదీశాడు. కట్టుకున్న భార్యను చెడమడా.. వాయించి.. ఆమె ప్రియుడికి దేహశుద్ది చేశాడు.


Read more: Viral Video: పెళ్లైన హీరోకు క్యూట్‌గా ప్రపోజ్ చేసిన సమంత.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో..


ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆమెది ప్రేమ వివాహం. అప్పటికే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారంట. ఇప్పుడు మరోకరితో యవ్వారం నడ్పించడం పట్ల మాత్రం చాలా సీరియస్ అయినట్లు తెలుస్తొంది. ఈ ఘటనలో మహిళను, ఆమె ప్రియుడిపై కూడా భర్త, బంధువులు దాడులకు పాల్పడినట్లు తెలుస్తొంది. ఆ తర్వాత పోలీసులకు అప్పజెప్పినట్లు తెలుస్తొంది.  ఈ దాడికి చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.