Minister Lokesh: తమ్ముడూ.. దిద్దలేని పెద్ద తప్పు చేశావ్.. ఎమోషనల్ అయిన లోకేష్.. అసలేం జరిగిందంటే..?
Nara Lokesh Emotional post: మంత్రి నారాలోకేష్ గుంటూరుకు చెందిన తన అభిమాని, పార్టీ కార్యకర్త సూసైడ్ చేసుకొవడం పట్ల తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తు .. సోషల్ మీడియాలో ఎమోషనల్ గా పోస్ట్ పెట్టారు.
TDP Activist Srinu suicide nara Lokesh emotional: సాధారణంగా కొంత మందికి రాజకీయాలు అంటే ఎంతో ఇష్టం. తమ అభిమాన నేత కోసం, పార్టీ కోసం ఏమైన చేస్తుంటారు. పార్టీ కార్యక్రమాల కోసం తమ జేబుల నుంచి ఖర్చులు చేసుకుంటారు. పార్టీకి చెందిన ప్రొగ్రామ్స్ లలో యాక్టివ్ గా ఉంటారు. తమ ప్రియతమ నాయకుడి జన్మదినాలు, పెళ్లి రోజులు.. ఏవైన గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తుంటారు.
ఇలాంటి నేపథ్యంలో.. కొన్ని సార్లు వారి ఇంట ఏదైన ఘటన జరిగితే.. ఎమోషనల్ అవుతుంటారు. ఈ క్రమంలో తమ అభిమాన నేత కోసం.. ఏమైన త్యాగాలు చేసేందుకు అస్సలు వెనుకాడరు. అయితే.. కొంత మంది నేతలు సైతం తమ అభిమానుల పట్ల అదేవిధంగా ప్రేమను, ఆప్యాయతను చూపిస్తుంటారు.
కార్యకర్త ఇంట్లో ఏది జరిగిన కూడా అక్కడికి వెళ్తుంటారు. ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం ఏపీ మంత్రి నారాలోకేష్ తన అభిమాని, పార్టీకార్యకర్త శ్రీను సూసైడ్ చేసుకొవడంపై ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు..
టీడీపీకి చెందిన డైహర్ట్ కార్యకర్త, శ్రీను ఆత్మహత్య చేసుకుని చనిపోవడం పట్ల టీడీపీ పార్టీకి చెందిన నేతలు.. తీవ్ర దిగ్బ్రాంతికి లోనైనట్లు తెలుస్తొంది. దీనిపై ఏకంగా మంత్రి నారాలోకేష్ స్పందించారంటే.. ఆ అభిమానికి టీడీపీ అంటే.. ఎంత ఇష్టమో అర్థమైపొతుంది. అయితే.. శ్రీనుకి చిన్న ప్పటి నుంచి టీడీపీ అంటే ప్రాణాలు ఇచ్చేవాడంట.. అంతే కాకుండా.. టీడీపీ కార్యక్రమాలు.. నాయకులు ప్రొగ్రామ్ లకు తప్పకుండా హజరయ్యే వాడంట. మరీ ఏజరిగిందో కానీ.. శ్రీను ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో ఈ ఘటన ఒక్కసారిగా పెనుదుమారంగా మారింది.
దీనిపై మంత్రి నారాలోకేష్ ఎక్స్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన పుట్టిన రోజు, పెళ్లి రోజు కార్యక్రమాల్ని.. శ్రీను పండగలా చేసేవాడని లోకేష్ చెప్పుకొచ్చారు. అలాంటి తనకు ఏంకష్టం వచ్చిందో.. ఒక్క మాట చెబితే.. వాటిని పరిష్కరించేవాడినని బాధపడ్డారు. ప్రతిసమస్యకు కూడా ఒక పరిష్కారం ఉంటుందని.. ఇలాంటి పనులు చేయకూడని.. మనం బతికి . . మరికొందర్ని బతికించాలని కూడా నారా లోకేష్ తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తొంది.
ప్రస్తుతం ఆ కుటుంబానికి మాత్రం.. తాము అన్ని విధాలుగా ఆదుకుంటామని కూడా నారా లోకేష్ అభయమిచ్చినట్లు తెలుస్తొంది. ఇలాంటి తొందర పాటు నిర్ణయాలు తీసుకొవద్దని అభిమానులకు, కార్యకర్తలను నారా లోకేష్ ఎక్స్ వేదికగా కోరినట్లు తెలుస్తొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.