Miss vizag nakshatra attack on her husband teja over extramarital affair: కొందరు వివాహేతర సంబంధాలు పెట్టుకుని తమ కాపురంను బజారుకు పడేసుకుంటున్నారు. పెళ్లి చేసుకుని తమ వాళ్లను, తమను నమ్మకుని వచ్చిన వాళ్లను బాగా చూసుకొవాల్సింది పోయి, కొద్దిపాటి సుఖాల కోసం దారుణాలు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలకు చెందిన ఘటనలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నారు. కొందరు పెళ్లికాక ముందు ఎఫైర్ లు కొనసాగించి, ఇంట్లో వాళ్లు లేదా మంచి క్యాష్ పార్టీ వాళ్లను చూసుకుని పెళ్లి చేసుకుంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


ఆ తర్వాత తమ పాత ఎఫైర్ లు మర్చిపోలేక, పెళ్లి  జరిగిన కూడా సీక్రెట్ గా సంబంధాలు కొనసాగిస్తున్నారు. మరికొందరు పెళ్లి అయిన తర్వాత , తమ భార్య సుఖ పెట్టడం లేదని, ఇతరులతో సంబంధాలు కొనసాగిస్తున్నారు. దీంతో పండంటి కాపురం కాస్త బజారున పడుతుంది.ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.


 


పూర్తి వివరాలు..


విశాఖ పట్నంలో వివాహేతర సంబంధానికి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికండ ఉండే తేజ, మిస్ వైజాగ్ నక్షత్రలు ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి 2017 లో పెళ్లి జరిగింది. కొంత కాలం వీరి కాపురం సజావుగానే సాగింది. వీరికి ఒక పాప కూడా ఉంది. అయితే.. తేజ పబ్జికి బానిసై ప్రతిరోజు తాగడం, అమ్మాయిలతో తిరగటం  వంటి వాటికి అడిక్ట్ అయినట్లు తెలుస్తోంది. దీంతో కొంత కాలంలో భర్య, భర్తల మధ్య విపరీతంగా గొడవలు జరుగున్నాయి.  ఈ క్రమంలో వీరిద్దరు కూడా సపరేట్ గా ఉంటున్నారు. ఈ క్రమంలో.. ఒక ఆఫీసులో మరో యువతితో తన భర్త తేజ ఉన్నాడని విషయం తెలుసుకున్న నక్షత్ర అక్కడికి చేరుకుంది. వెంటనే అతడిని నిలదీసింది. ఈ క్రమంలో తేజపై చేయిచేసుకుంది. దీంతో తేజ.. తన భార్యను అక్కడికి నుంచి వెళ్లిపోవాల్సిందిగా గెంటేశాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని నక్షత్రను అక్కడి నుంచి పంపించి వేశారు.


రోజుకో వర్జీన్ అమ్మాయి కావాలి..


ఈ నేపథ్యంలో నక్షత్ర సంచలన విషయాలు బైటపెట్టింది. తన భర్తకు పబ్జీకి అలవాటు పడ్డాడని, అమ్మాయిలను ట్రాప్ చేస్తాడని కూడా చెప్పుకొచ్చింది. తనకు రోజుకో వర్జిన్ కావాలని, అమ్మాయిలను తెచ్చిపెట్టాలని వేధించే వాడని కన్నీళ్లు పెట్టుకుంది. అతగాడు నావల్ డాక్ యార్డ్ లో తప్పులు చేయడం వల్ల సస్పెండ్ అయ్యాడని చెప్పింది. తనకు విడాకులు ఇవ్వకుండా మరో యువతితో ఎలా ఉంటాడని ప్రశ్నించింది. తన భర్త తనకు కావాలని నక్షత్ర పోలీసుల ఎదుట కన్నీళ్లు పెట్టుకుంది.


Read more: Snake: వామ్మో.. ఫ్యాన్ మీద ప్రత్యక్షమైన భయంకరమైన పాము.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..


ఇక మరోవైపు నక్షత్ర భర్త , తేజ వాదన మరోలా ఉంది. తనపై లేని పోనీ అభాండాలు వేస్తున్నారని అంటున్నాడు. ఇది సినిమా ఆఫీస్ అని, ఆ అమ్యాయి ఆడిషన్స్ కు వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఈ ఘటన మాత్రం ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter