Chirri Balaraju Supporters: నిజాలు నిక్కచ్చిగా అందిస్తున్న జీ తెలుగు న్యూస్‌పై ఆంధ్రప్రదేశ్‌లో దాడి జరిగింది. జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అనుచరులు రెచ్చిపోయారు. ఓ వార్త ప్రసారం విషయమై రిపోర్టర్‌ను బెదిరింపులకు పాల్పడుతూనే దాడి చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆగడాలు పెరిగిపోతున్నాయని.. ప్రసారం చేయగా రిపోర్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపింది. జీ తెలుగు న్యూస్‌ దాడిపై సీనియర్‌ జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Sachivalaya System: మళ్లీ సచివాలయ వ్యవస్థలో భారీ మార్పులు.. సీఎం చంద్రబాబు ఫోకస్‌


ఏపీలోని ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో జీ తెలుగు న్యూస్ ఛానల్ రిపోర్టర్‌గా దుర్గా ప్రసాద్ విధులు నిర్వహిస్తున్నాయరు.  జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు సంబంధించిన ఓ వార్త ప్రసారం చేశారు. దాన్ని చూసిన ఎమ్మెల్యే అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే కోపంతో దుర్గా ప్రసాద్‌పై కక్షగట్టారు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి 8 గంటల సమయంలో కొయ్యలగూడెం రాష్ట్ర రహదారిపై జీ తెలుగు న్యూస్‌ రిపోర్టర్‌ దుర్గా ప్రసాద్‌ను ఎమ్మెల్యే అనుచరులు వెంబడించ భయాభ్రాంతులకు గురి చేశారు.

Also Read: YS Sharmila: సముద్రంలో పవన్‌ కల్యాణ్‌ హడావిడి చేయడం కాదు.. నిజాలు నిగ్గు తేల్చాలి


అలా తరుముతూ పొగాకు బోర్డు  సమీపంలోకి దుర్గా ప్రసాద్‌ను అడ్డగించారు. 'మా సార్‌పై వార్త వేస్తావా' అంటూ జీ తెలుగు న్యూస్‌ రిపోర్టర్‌ దుర్గా ప్రసాద్‌పై కారం పొడి చల్లారు. ఇద్దరు గుర్తుతెలియని యువకులు కారం చల్లి దాడికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా అసభ్య వ్యాఖ్యలు చేశారని సమాచారం. వారి దాడిలో దుర్గా ప్రసాద్‌ గాయపడ్డారు. దాడి చేసిన అనంతరం అనుచరులు పారిపోగా.. అక్కడ ఉన్న కొందరి సహకారంతో కళ్లు తుడుచుకున్నారు.


సమాచారం అందుకున్న సహచర జర్నలిస్టులు ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు. జీ తెలుగు న్యూస్‌పై దాడిని జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. రిపోర్టర్ దుర్గాప్రసాద్‌కు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని జర్నలిస్టు సంఘాల భరోసా ఇచ్చారు. కాగా ఈ దాడిపై జర్నలిస్టు సంఘాలు మంగళవారం నిరసనలకు పిలుపునిచ్చాయి. కాగా ఈ దాడిపై పోలీసులకు బాధితుడు దుర్గా ప్రసాద్‌ ఫిర్యాదు చేయనున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.