అమరావతి: సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు షాక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇటీవల ఏపీకి మూడు రాజధానులు అవసరమని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించగా.. జనసేన ఎమ్మెల్యే మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. పార్టీ అధ్యక్షుడు పవన్ మాత్రం రాజధాని అమరావతిలోనే ఉండాలంటూ వైఎస్సార్ సీపీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాలలో మూడు రాజధానులకు సంబంధించి బిల్లు ప్రవేశపెడితే తాను కచ్చితంగా మద్దతు తెలుపుతానని రాపాక వరప్రసాదరావు మీడియాతో చెప్పిన మాటలు పవన్ షాకిస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: కాలినడకన అసెంబ్లీకి వెళ్లిన చంద్రబాబు


ఏపీలో అభివృద్ధి కావాలంటే పరిపాలన వికేంద్రీకరణతోనే సాధ్యమని రాపాక అభిప్రాయపడ్డారు. అభివృద్ధి కోసమే ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, మూడు రాజధానుల అంశానికి సంపూర్ణ మద్దతు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి వైఎస్సార్ సీపీతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ వస్తోన్న రాపాక.. రాజధాని విషయంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తో ఏకీభవించడం లేదు. గత కొంతకాలం నుంచి పార్టీ నేతలతో అంతగా టచ్‌లో లేరు. 


Also Read: వైసీపీకి ఎందుకంత వణుకు: నాదెండ్ల మనోహర్


కాగా, ఏపీ సర్కార్ నుంచి పూర్తి స్థాయిలో నిర్ణయం వెలువడ్డాక రాజధాని అంశంపై తమ వైఖరి, కార్యాచరణ ఉంటుందని పవన్ చెబుతున్నారు. బీజేపీతో కలిసి తాము పనిచేయనున్నట్లు ఇటీవల పవన్ స్పష్టం చేశారు. అయితే పార్టీ నిర్ణయం ఒకలా ఉంటే, ఎమ్మెల్యే రాపాక మాత్రం పవన్ మాటను పెడచెవిన పెడుతున్నారని జనసేన నేతలలో అసహనం వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. మూడు రాజధానుల అంశంపై అసెంబ్లీలో వైఎస్సార్ సీపీ బిల్లు ప్రవేశపెట్టనుంది.


ఎమ్మెల్యేకు పవన్ కల్యాణ్ షాక్!



ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు జనసేన పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని బహిరంగ లేఖ రాశారు పవన్. ‘ఏపీ డిసెంట్రలైజేషన్‌ అండ్‌ ఈక్వల్‌ డెవలప్‌మెంట్ రీజియన్‌ యాక్ట్‌ 2020’, ‘అమరావతి మెట్రో డెవలప్‌మెంట్ యాక్ట్ 2020’ బిల్లులను వైఎస్సార్ సీపీ నేతలు ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టే సమయంలో వ్యతిరేకించాలని లేఖలో పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..