AP CM Jagan on flood relief activities: ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు అతలాకుతలం చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేశారు సీఎం జగన్. ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు సహాయక చర్యఏపీలోలో చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం, ప్రకాశం సహా పలు జిల్లాల్లో వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చిన నేపథ్యంలో.. సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు ఆయా ప్రాంతాల్లో ఏరియల్ సర్వే (AP CM Jagan Aerial survey) నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేశారు జగన్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వరద ప్రభావిత ప్రాంతాలకు ప్రాతనిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొనాలని (CM Jagan Instructions on flood relief measures) సూచించారు. బాధితులకు సహాయం చేస్తూ వారికి అండగా నిలవాలని ఆదేశించారు.


అసెంబ్లీ సమావేశాలకు రాకపోయిన పరవాలేదు..


వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు, మంత్రులు అసెంబ్లీ సమావేశాలకు హాజరవకపోయినా పరవాలేదని స్పష్టం చేశారు జగన్మోహన్ రెడ్డి.


Also read: ఏపీ ప్రభుత్వంపై పవన్ మండిపాటు.. వరద బాధితులకు సహాయంపై అసంతృప్తి!


వరద ప్రభావం అధికంగా ఉన్న నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో బాధితులకు ఉచితంగా 25 కిలోల బియ్యం, కిలో కంది పప్పు, ఉల్లిగడ్డలు, ఆలు గడ్డలు కేజీ చొప్పున, లీటర్ వంట నూనే అత్యవసర సహాయంగా అందించాలని పేర్కొన్నారు. జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకును ప్రజలతోనే కలిసి ఉండాలని స్పష్టం చేశారు.


వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటు వ్యాధులు వ్యాపించే ప్రమాదమనున్న నేపథ్యంలో వైద్యులకు కూడా కీలక సూచనలు చేశారు సీఎం జగన్. స్థానిక వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు. వరద కారణంగా పంట దెబ్బ తిన్న రైతులకు.. తిరిగి సాగు చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు జగన్​.ల్లో చురుగ్గా పాల్గొనాలని ఆదేశించారు.


Also read: అమరావతి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు


Also read: ఆంధ్రప్రదేశ్ లో భారీవర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు.. అనేక రైళ్లు దారి మళ్లింపు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook