అమరావతి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

Somu Veerraju ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు ఏపీ బీజేపీ స్పష్టం చేసింది. అందుకోసమే అక్కడ అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నట్లు తెలిపింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 21, 2021, 06:02 PM IST
  • అమరావతి రైతుల మహా పాదయాత్రకు ఏపీ బీజేపీ మద్దతు
  • నెల్లూరులో పాద యాత్రలో పాల్గొన్న బీజేపీ నేతలు
  • వరద సహాయక చర్యలపై సోము వీర్రాజు అసంతృప్తి
అమరావతి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

AP BJP Support farmers' Maha Padayatra: అమరావతి మహా పాదయాత్రకు బీజేపీ మద్దతు ప్రకటించింది. పాద యాత్ర 21వ రోజు నెల్లూరు జిల్లా నుంచి ప్రారంభమవగా.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) సహా ఇతర నాయకులు పాదయాత్రలో (AP BJP in Farmers' Maha Padayatra) పాల్గొన్నారు.

పాదయాత్రలో పాల్గొన్న రైతులకు.. సమీప గ్రామాల నుంచి యువత, సహా రాజకీయ పార్టీల నేతలు సంఘీభావం ప్రకటించారు.

ఈ సందర్భంగా.. రైతులు ఏర్పాటు చేసిన సభలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని స్పష్టం చేశారు.

'నేటి నుంచి అమరావతి రైతుల మహా పాదయాత్రలో పాల్గొని.. యాత్ర చివరి వరకు వారితే ఉండనున్నాం' అని సోము వీర్రాజు పేర్కొన్నారు. అమరావతిలోనే బీజేపీ రాష్ట్ర కార్యాలయం (Amaravathi) కడుతున్నట్లు వెల్లడించారు.

Also read: ఆంధ్రప్రదేశ్ లో భారీవర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు.. అనేక రైళ్లు దారి మళ్లింపు

Also read: చంద్రబాబు ఏడవడం చూసి తానూ ఏడ్చేసిన భువనేశ్వరి... అసెంబ్లీ ఘటనపై ఆమె రియాక్షన్ ఇదే...

కేంద్రం కట్టుబడి ఉంది..

కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి మాట్లాడుతూ.. అమరావతి రాజధానికే కేంద్రం ఇప్పటికే కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఎయిమ్స్​, అనంతపురం-అమరావతి రోడ్డు పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అమరావతి రాజధానిగా ఉండటమేనని బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీ నారాయణ పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజలే బుద్ధి చెబుతారని వివరించారు.

రైతుల నిరసనలను పక్కదారి పట్టించేందుకే అసెంబ్లీలో గందరగోళం సృష్టించారని పేర్కొన్నారు లక్ష్మీ నారాయణ.

Also read: కడపలో తిరుమల ఎక్స్‌ప్రెస్‌ నిలిపివేత.. అధికారులతో ప్రయాణికుల గొడవ

నష్టపరిహారం చెల్లించాలి..

ఇదిలా ఉండగా వర్ష బీభత్సంపై కూడా ట్విట్టర్​ ద్వారా స్పందించారు సోము వీర్రాజు. ప్రకృతి బీభత్సం సృష్టించిన అన్ని ప్రాంతాల్లో పర్యటించి.. నష్టాన్ని అంచనా వేసి.. పరిహారం అందించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.

సీఎం జగన్ సొంత జిల్లా కడప, చుట్టుపక్కల జిల్లాలు అనంతపురం, నెల్లూరు, ప్రకాశంలో కుంటపోత వానలు పడి, వరదలతో ప్రజలు అవస్థలు పడుతుంటే.. పట్టించుకోవడం లేదని విమర్శలు చేశారు.

Also read: ఉధృతంగా పెన్నా నది... వరదతో కోతకు గురైన హైవే... 5కి.మీ మేర ట్రాఫిక్ జామ్...

Also read: చంద్రబాబుకు రజనీకాంత్ ఫోన్ కాల్... అసెంబ్లీ ఘటనపై విచారం వ్యక్తం చేసిన సూపర్ స్టార్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News