MP Avinash Reddy Attended CBI Investigation: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. దాదాపు నాలుగు గంటలపాటు సీబీఐ అధికారులు ఆయనను ప్రశ్నించారు. విచారణలో భాగంగా అవినాష్ రెడ్డి స్టేట్‌మెంట్ రికార్డును సీబీఐ అధికారులు రికార్డు చేసినట్లు సమాచారం. ఎంక్వరీ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు ఎంపీ. సీబీఐ విచారణకు పూర్తిగా సహకరించినట్లు చెప్పారు. వాళ్లు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్లు పేర్కొన్నారు. అవసరమైతే మళ్లీ పిలుస్తామన్నారని తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ఐవో గారు అడిగిన ప్రశ్నలకు నాకు తెలిసిన సమాధానాలు చెప్పాను. నాకు తెలిసిన డిటేయిల్స్ అన్ని వారికి ఇచ్చాను. కొన్ని రోజుల తరువాత మళ్లీ అవసరం అయితే పిలుస్తామని చెప్పారు. వాళ్లకు మళ్లీ ఏమైనా సందేహాలు ఉంటే తప్పకుండా సహకరిస్తా. గడిచిన కొంత కాలంగా ఈ కేసులో ఓ సెక్షన్ ఆఫ్ మీడియా విపరీతమైన వక్రీకరణలకు గురిచేస్తోంది. వాస్తవాలను వక్రీకరించి.. విచారణను తప్పుదోవ పట్టిస్తోంది. 


ఇవన్నీ జరగ్గకూడదంటే.. వీడియో కవరేజ్, ఆడియో కవరేజ్, అడ్వకేట్ ఉంటే రేపొద్దున నేను ఇచ్చే స్టేట్‌మెంట్స్, నేను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావు కదా అన్నాను. ట్రాన్స్‌పరేన్సీ కోసం.. ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ కోసం రిక్వెస్ట్ చేశాం. అయితే సీబీఐ ఐవో గారు కుదరదని చెప్పారు..' అని ఎంపీ అవినాష్ రెడ్డి వెల్లడించారు.
 
సీఎం జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంరెడ్డి హత్య కేసును విచారిస్తున్న సీబీఐ.. ఈ నెల 23న అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. 24న విచారణకు హాజరవ్వాలని నోటిసుల్లో పేర్కొంది. అయితే విచారణకు ఒక్క రోజు ముందు నోటిసులు ఇస్తే ఎలా అని.. తనకు ముందుగా నిర్ణయించుకు కార్యక్రమాల వల్ల హాజరుకాలేనన్నారు. మరోసారి నోటిసులు ఇస్తే ఆలోచిస్తానని రిప్లై ఇచ్చారు. దీంతో 28న విచారణకు హాజరవ్వాలని మళ్లీ నోటిసులు ఇవ్వడంతో.. శనివారం సీబీఐ విచారణకు హాజరయ్యారు.  


Also Read: David Warner: పఠాన్ లుక్‌లో అదగొట్టిన డేవిడ్ వార్నర్.. ఆస్కార్ గ్యారంటీ  


Also Read: Ind Vs NZ: కివీస్‌తో రెండో టీ20.. ఎవరూ ఊహించని రెండు మార్పులు.. పృథ్వీ షా ఎంట్రీ కన్ఫార్మ్..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి