Mudragada Padmanabham letter : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం..ఎస్ఈసీ వైఖరిని తప్పుబడుతూ లేఖ రాశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఏపీలో పంచాయితీ ఎన్నికల వివాదం ( Ap Panchayat Elections 2021 Dispute ) ఇంకా కొనసాగుతోంది. ఎన్నికల నిర్వహణపై హైకోర్టు  ( High Court ) డివిజన్ బెంచ్ ఆదేశాల్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ( Supreme Court ) ను ఆశ్రయించింది. జస్టిస్ సంజయ్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటీషన్‌పై ఇవాళ విచారించనుంది. మరోవైపు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ( Sec Nimmagadda Ramesh Kumar ) తీరుపై అన్నివైపుల్నించి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


తాజాగా మాజీ ఎంపీ, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ( Kapu agitation leader Mudragada padmanabham ) నిమ్మగడ్డ మరేశ్ కుమార్ వైఖరిపై విచారం వ్యక్తం చేశారు. ఎన్నికల కమీషనర్‌కు స్వయంగా లేఖ ( Mudragada letter to Nimmagadda ) రాశారు. ఉద్యోగంలో ఉండి రాజకీయాలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. ఇలాంటి పరిస్థితి ఒక్క ఇండియాలోనే తొలిసారిగా చూస్తున్నానని విమర్శించారు. వీలైతే ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయమని సూచించారు. సాధ్యమైతే సలహాలివ్వాలని కోరారు. పరిస్థితి చూస్తుంటే..నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వెనుక అదృశ్య శక్తి నడిపిస్తున్నట్టు అనుమానం ఉందన్నారు. ఏపీ ప్రభుత్వం ( Ap Government ) పై ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చేస్తున్నదాడిని మీడియా ద్వారా చూస్తున్నానన్నారు. రాష్ట్రంలోని పరిస్థితిని అర్దం చేసుకుని ఎన్నికల నిర్వహణకు ప్రయత్నించాలే తప్ప..రాజకీయ నాయకుల్లా పట్టుదలకు పోవడం మంచిది కాదన్నారు. ఇప్పటికైనా రచ్చ చేయడం మానేయాలని విజ్ఞప్తి చేశారు. 


Also read: AP Panchayat Elections 2021: పంచాయితీ ఎన్నికల కేసులో..సుప్రీంకోర్టులో మారిన బెంచ్, సర్వత్రా ఆసక్తి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook